పెను సంచలనం సృష్టించిన ముగ్గురు బాలికల వరుస హత్యల నిందితుడు,హాజీపూర్‌ సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసులో పోలీసులు ఇప్పటికే కీలక సాక్ష్యాధారాలను సేకరించారన్న విషయం తెలిసిందే. ఇకపోతే  ముగ్గురు విద్యార్థినులను శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం చేసి హత్య చేయగా. మృతదేహాలపై ఉన్న రక్తపు మరకలు శ్రీనివాస్‌రెడ్డివిగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ తేల్చింది. ఇక రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ పర్యవేక్షణలో భువనగిరి జోన్‌ డీసీపీ నారాయణరెడ్డి నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. ఏప్రిల్‌ 26న శ్రీనివాస్‌రెడ్డిపై మొదటి కేసు నమోదైంది. అదే నెల 30న పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.


ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేశారు. కాగా వరంగల్‌ సెంట్రల్‌ జైలులో విచారణ ఖైదీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి అక్కడినుండి  తరలించి నల్లగొండ సెషన్స్‌ కోర్టులో విచారణ సాగించారు అనంతరం భువనగిరి స్పెషల్ కోర్టుకు కేసు బదిలికాగా విచారణ ప్రారంభించిన భువనగిరి స్పెషల్ కోర్టుకు పోలీసులు ఈ నెల పద్నాలుగో తారీఖునుండి పద్దెనిమిదో తారీఖు వరకు ట్రయల్ చార్జీషీట్ కాపీలతోపాటుగా డిఎన్ఏలను, ఫోరెనిక్స్ రిపోర్టులను సమర్పించారు. వీటితోపాటుగా ఈ కేసులో 300 మంది సాక్షులను విచారించి, వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసి కోర్టుకు అందచేసారు..


ఇక దీనితో నేరం నిరూపణ కావడానికి కావాల్సిన బలమైన సాక్ష్యాధారాలను అన్నిటినీ కోర్టుకు పోలీసులు అందచేసినట్లేనని తెలిపారు. ఇకపోతే ఈ కేసును మరో 45రోజుల పాటు విచారణ సాగించిన అనంతరం తుది తీర్పును ప్రకటించనున్నారని పోలీసులు తెలిపారు. ఇకపోతే ఈ సైకో శ్రీనివాస్ రెడ్డి 2015లో 11ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసాడు, ఆతర్వాత కొంతకాలానికి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసాడు. ఇదేతరహలో  స్కూల్‌కు వెళ్లి వస్తున్న బాలికపై కూడా అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత హత్య చేసాడు. ఇక ఈ ముగ్గురినీ పాడుపడిన బావిలో పాతిపెట్టాడు. ఇంతనీచానికి ఒడిగట్టిన శ్రీనివాస్ రెడ్డి మనిషి రూపంలో ఉన్న మృగమని, ఇతనికి ఉరిశిక్షతప్ప మరే శిక్షవేసిన మరణించిన బాలికలకు న్యాయం జరుగనట్లేనని స్దానికులు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: