కమెడియన్, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ని కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేసారు. ముంబై చెందిన ఓ ఫైనాన్సియర్ ని మోసం చేసిన కేసులో బండ్ల గణేష్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం పోలీసులు బండ్ల గణేష్ ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.                   

                                  

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బండ్ల గణేష్ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకొని కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం కమెడియన్ అయినా బండ్ల గణేష్ నిర్మాతగా అడుగుపెట్టాడు. అయితే ఆరంభంలో పరాజయాలు ఎదురుకున్న బండ్ల గణేష్ .. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో మళ్ళి సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు.               

                                

ఆ తర్వాత బండ్ల గణేష్ బాద్ షా, టెంపర్, గోవిందుడు అందరి వాడేలే లాంటి చిత్రాలు పెద్ద స్టార్స్ నిర్మించాడు. అయితే ఈ 2019 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఆరంభంలోనే రాజకీయ పరమైన సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బండ్ల గణేష్ సోషల్ మీడియాని ఓ ఊపు ఊపాడు. అనంతరం ఎన్నికల్లో గోరతి ఘోరంగా ఓడిపోయి రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయ్యి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.                      

                         


మరింత సమాచారం తెలుసుకోండి: