ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో రోజు రోజుకు అభద్రత పెరిగిపోతోందా ? తెలుగుదేశంపార్టీలో ఇపుడిదే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.  జాతీయస్ధాయిలో నరేంద్రమోడి, అమిత్ షా ప్రభ రోజురోజుకు వెలిగిపోతుండటం, ఇక్కడేమో పరిపాలనలో జగన్ దూసుకుపోతుండటంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. దానికితోడు మహారాష్ట్ర, హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బిజెపిదే గెలుపు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

ముఖ్యమంత్రి అయినప్పటి నుండి చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలపై జగన్ విచారణలు చేయిస్తున్నారు. చాలా ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని నిపుణుల కమిటిలు ప్రాధమిక నివేదికలు కూడా అందించారు. తనకు వ్యతిరేకంగా కేంద్రంలో మోడి, రాష్ట్రంలో జగన్ ఎక్కడ ఏకమై అవినీతిపై విచారణకు నిర్ణయం తీసుకుంటారో అనే భయం చంద్రబాబులో పెరిగిపోతోందని సమాచారం.

 

అందుకనే బిజెపితో పొత్తుకు చంద్రబాబు మళ్ళీ రాయబారాలు మొదలుపెట్టారు. అయితే ఒట్టిపోయిన గేదెలాంటి టిడిపితో పొత్తు ఎందుకు పెట్టుకోవాలని రాష్ట్ర బిజెపి నేతల వాదనతో అమిత్ షా ఏకీభవించినట్లు తెలుస్తోంది. అందుకనే చంద్రబాబు నుండి ఎన్ని సంకేతాలు వెళుతున్న అటునుండి సమాధానం మాత్రం రావటం లేదు. అదే సమయంలో టిడిపి నేతల్లో వీలైనంతమందిని పార్టీలో చేర్చుకోవాలని బిజెపి అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు.

 

బిజెపితో పొత్తు సానుకూలం కాకపోవటం ఒకవైపు, నేతలను పార్టీ వదిలి వెళ్ళకుండా ఆపుచేసే శక్తి కోల్పోయి మరోవైపు చంద్రబాబులో టెన్షన్ పెంచేస్తోంది. నిజానికి చంద్రబాబు టెన్షన్ తన కోసం కానేకాదు.  టెన్షన్ అంతా పుత్రరత్నం లోకేష్ గురించే.

 

ఎన్నిప్రయత్నాలు చేసినా లోకేష్ లో వ్యవహార,  రాజకీయ జ్ఞానం పెరగటం లేదు. మొదటి నుండి కష్టమంటే తెలీకుండా పెంచటం వల్లే లోకేష్ ఇపుడిలా తయారయ్యాడని నేతలే చెబుతుంటారు. ఎంతమంది పండితులను పెట్టి శిక్షణ ఇప్పించినా లోకేష్ లో ఆవగింజంత జ్ఞానం కూడా పెరగలేదంటే ఏమిటర్ధం ? తన తర్వాత లోకేష్ పరిస్ధితి ఏమవుతుందో అన్న టెన్షన చంద్రబాబును పట్టి కుదిపేస్తోందని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 


మరింత సమాచారం తెలుసుకోండి: