ఆర్టీసీ కార్మికుల సమ్మె గత 18 రోజుల నుంచి తెలంగాణలో క్వాసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టు ఆదేశాలపై నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రి పువ్వాడ అజయ్, ఉన్నతాధికారులు నేడు భేటీ అయ్యి ఆర్టీసీ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 


అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ పట్టుపట్టబోమని కోర్టులో కార్మిక సంఘాల తరఫు న్యాయవాది చెప్పడంతో కార్మికుల విలీనం డిమాండ్ వదులుకున్నట్టు అయ్యింది. దీంతో వారు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఆ డిమాండ్లను అధ్యయనం చెయ్యండి అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 


ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి సీఎం ప్రకటనపై స్పందిస్తూ 'విలీనం డిమాండ్‌పై తాము వెనక్కి తగ్గే ప్రసక్తిలేదని ప్రకటించారు. కాగా కార్మిక సంఘాల ఐక్యత దెబ్బ తినద్దు అని, ఎవరు అధైర్య పడొద్దు అని చెప్పారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన అశ్వత్థామరెడ్డి ఈ విషయాలను స్పష్టం చేశారు. 


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌పై వారు వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని అయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని.. అది తప్పు అని, కార్మికుల పోరాటం అన్యాయం అని తేలితే రేపే విధులకు హాజరవుతామని అయన ప్రకటించారు.  


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఉన్న ఇబ్బంది ఏంటో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయాలని అశ్వత్థామరెడ్డి కోరారు. ఇందిరా పార్క్‌ వద్ద రేపు చేపట్టే ధర్నాకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని అయన పిలుపునిచ్చారు. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో పర్యటించి కార్మికులకు ధైర్యం చెబుతామని అశ్వత్థామరెడ్డి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: