మరి కొద్ది గంటల్లో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం రానుంది. అయితే ఇది ఎవరికి అనుకూలం అన్నది మాత్రం కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు ఎగ్టిట్ పోల్స్ ఫలితాలు టీయారెస్  కి అనుకూలంగా ఉన్నాయి. అదే సమయంలో భారీగా జరిగిన పోలింగ్ మాత్రం అధికార పార్టీని యమ టెన్షన్ పెడుతోంది. ఇంత పెద్ద ఎత్తున ఒక ఉప ఎన్నికలో జనం తరలి వచ్చి ఓటు చేశారంటే కారణం ఏమై ఉంటుందన్నది కూడా చర్చగా ఉంది.


ఇక్కడ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేశారు. ఈ సీట్లో కాంగ్రెస్ కి, ఉత్తమ్ కి గట్టి పట్టు ఉంది. అదే సమయంలో తెలంగాణాలో చోటు చేసుకున్న అనేక పరిణామాలు కూడా చూసుకుంటే మాత్రం ఈ సీట్లో గెలుపు ఎవరిది అన్నది సులువుగా చెప్పలేరని అంటున్నారు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే పట్టం కడతారు. కానీ ఇక్కడ ప్రతిపక్షం కూడా బలంగా ఉండడం, ప్రతిష్టగా తీసుకోవడంతో ఫలితం అటుంచి ఇటు అయినా ఆశ్చర్యపోనవ‌సరం  లేదని అంటున్నారు. 


85 శాతం పైగా పోలింగ్ జరిగిన ఈ ఉప ఎన్నికల్లో సీపీఐ ఓట్లు అయిదు వేల వరకూ ఉన్నాయి. అవి ఎటువైపు పడి ఉంటాయన్నది ఒక చర్చగా ఉంది. అలాగే టీడీపీ మద్దతు సామాజికవర్గం ఇరవైవేల మంది దాకా జనాభా ఉన్నారు. వారు కనుక టీయారెస్ కి వ్యతిరేకంగా ఓటు చేయాలనుకుంటే కచ్చితంగా కాంగ్రెస్ కే పడతాయి. అలాగే ఎంత కాదనుకున్నా ఆర్టీసీ సమ్మె, ప్రజా వ్యతిరేకత కూడా కలిస్తే టీయారెస్ కి టఫ్ ఫైట్  అవుతుందని అంటున్నారు. ఒక వేళ అధికార పార్టీని గెలిపించాలనుకున్నా బంపర్ మెజారిటీని ఇవ్వకుండా సింపుల్ మెజారిటీతో గెలిపించినా కూడా అది టీయారెస్ కి అవమానమే. అందువల్ల బంపర్ విక్టరీ టీయారెస్ కొడితేనే అధికార పార్టీకి టెన్షన్ తగ్గుతుంది. హోరా హోరీ పోరు జరిగి కాంగ్రెస్ ఓడినా కూడా కేసీయార్ సర్కార్ కి డేంజర్ బెల్స్ మోగినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: