పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి చాలాకాలం అయ్యింది.  సినిమా విషయంలో అడుగు ముందుకు వేస్తె నాలుగడుగులు వెనక్కి వేస్తున్నారు.  2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తరువాత పవన్ పార్టీపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.  పవన్ ఇక రాజకీయాల్లో ఎంతమాత్రం ఉండరని, పవన్ సినిమాల్లోకి తిరిగి వచ్చేస్తారని వార్తలు వచ్చాయి.  కానీ, ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.  పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారని వార్తలు అవాస్తవం.  


దీనిపై క్లారిటీ ఇచ్చారు.  తాను రాజకీయాల్లోకి వచ్చే సమయంలోనే తన చివరిశ్వాస ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటానని మాట ఇచ్చానని మాట తప్పే ప్రసక్తే లేదని అన్నారు.  ఒక చిన్న ఇంటిని నడపాలి అంటేనే ఎంతో ఖర్చు అవుతుంది.  అలాంటిది ఒక పార్టీని నడపడం అంటే మాములు విషయం కాదు.  అధికారంలో లేకుండా.. ఎక్కువ సీట్లు గెలుచుకోలేకుండా పార్టీని నడిపించడం అన్నది చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది.  దీనిపై పవన్ కళ్యాణ్ పక్కా క్లారిటీ ఇచ్చారు.  


చాలామంది తనను వెనక్కి తగ్గుతున్నారని అంటున్నారని, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, ముందుకు సాగడమే తనకు తెలుసునని అన్నారు, ఇక నవంబర్ 3 వ తేదీన వైజాగ్ లో లాంగ్ మార్చ్ చేయబోతున్నారు.  ఈ మార్చ్ ద్వారా ప్రజలు తన బలం ఏంటో చూపించబోతున్నారు.  వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ పార్టీ బలపడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోబోతున్నది.  పార్టీని ఎన్నికల్లో నిలబెట్టడం ద్వారా కనీసం కొంతమేరకైనా ఓట్లు సాధించాలని చూస్తున్నది.  ఇప్పటి నుంచే పునాదిని స్ట్రాంగ్ గా చేసుకుంటే తప్పనిసరిగా భవిష్యత్తులో పార్టీ బలపడుతుందని పవన్ అంచనా వేస్తున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  కేసుల్లో ఉన్న వ్యక్తులు ధైర్యంగా మాట్లాడలేరని, ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి తన బలంగా వినిపించకపోవడానికి ఇదొక కారణం అని పవన్ పేర్కొన్నారు. జగన్ కు సిబిఐ అంటే భయపడుతున్నారని పవన్ చెప్పారు.  వచ్చే ఎన్నికల నాటికీ పార్టీని బలోపేతం చేస్తామని పవన్ చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: