పాక్ ప్రస్తుతం నానా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  ఇండియాపై అక్కసు వెళ్లబోయడంలో ముందున్న పాక్, అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయింది.  ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన పాక్, ఎఫ్ఏటిఎఫ్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది.  ఇది ఆ దేశానికీ మర్చిపోలేని, కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.  మరొకరి కోసం గోతిని తవ్వి.. చేసిన తప్పులకు తానే ఆ గోతిలో పడ్డట్టుగా మారింది పాక్ పరిస్థితి.  ఎఫ్ఏటిఎఫ్ రూపొందించిన 27 అంశాల్లో కేవలం 7 అంశాలు మాత్రమే సంతృప్తికరంగా ఉండటంతో... పాక్ ను డార్క్ గ్రే లిస్టులో ఉంచాలని అనుకున్నా... అక్కడి ప్రజల పరిస్థితిని అర్ధం చేసుకున్న ఎఫ్ఏటిఎఫ్ సంస్థ పాక్ కు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం ఇచ్చింది.  


ఎఫ్ఏటిఎఫ్ తో పాటుగా మిత్రదేశంగా చెప్పుకునే అమెరికా కూడా పాక్ కు వార్నింగ్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే.  ఉగ్రవాద నిర్మూలనకు పాక్ నడుం బిగించాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, ఇండియాకు నమ్మకం కలిగించాలని అమెరికా అంటోంది. ఇండియా పేరు చెప్తేనే అంతెత్తున ఎగిరిపడే పాక్, ఇండియాకు నమ్మకం కలిగించే విధంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని అంటే వింటుందా చెప్పండి.  చచ్చినా పర్వాలేదు.. ఇండియాకు నమ్మకం కలిగించే పనులు చేయడానికి సిద్ధంగా లేమని చెప్పేస్తుంది.  


ఇప్పుడు పాక్ మెడకు నవాజ్ షరీఫ్ పేరుతో మరో ఉచ్చు బిగుసుకోబోతున్నది.  మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను వివిధ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  ఆయన్ను జైలులో ఉన్నారు.  గత కొంతకాలంగా అయన అనారోగ్యంతో ఉండటంతో.. ఇటీవలే హాస్పిటల్ కు తీసుకొచ్చారు.  సడెన్ గా బ్లడ్ లోని ప్లేట్ లెట్స్ పడిపోయాయి.  ప్లేట్స్ లెట్స్ 16000 కు పడిపోవడంతో అయన పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.  ఇమ్రాన్ పై మండిపడుతున్నారు.  


నవాజ్ షరీఫ్ కొడుకు ఇమ్రాన్ పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.  తన తండ్రిపై విషప్రయోగం చేశారని, అనారోగ్యంగా ఉన్న తన తండ్రిని చాలాకాలంపాటు హాస్పిటల్ లో వేధింపులకు గురిచేశారని, దీనికి ఇమ్రాన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  ఇప్పటికే అంతర్జాతీయంగా ఇమ్రాన్ ఖాన్ మొట్టికాయలు వేయించుకుంటున్నారు.  ఆవేశాలకు పోయి.. లేనిపోని అనర్ధాలు కొని తెచ్చుకుంటున్నాడు.  ఇప్పుడు నవాజ్ షరీఫ్ కు ఏదైనా జరిగితే.. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది.  ఇది ఆ ప్రభుత్వానికి ఒక మచ్చగా ఏర్పడుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: