ఈనెల 21 వ తేదీన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలోని 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.  అలానే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 51 నియోజక వర్గాలకు కూడా ఎన్నికలు జరిగాయి.  వీటి రిజల్ట్ ఈరోజున రాబోతున్నది.  మరి కాసేపట్లోనే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.  ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలౌతుంది.  


మొదట బ్యాలెట్ పేపర్ల లెక్కింపు ఉంటుంది.  తరువాత ఈవీఎం ల కౌంటింగ్ ఉంటుంది. మహారాష్ట్ర, హర్యానాలో అప్పుడే సందడి మొదలైంది.  ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  ఎగ్జిట్ పోల్స్ అన్నీకూడా బీజేపీకి అనుకూలంగా ఉండటంతో ... బీజేపీ విజయం నల్లేరు మీద నడకే అన్న చందాన మారింది.  మహారాష్ట్రలో బీజేపీ 164 స్థానాల్లో పోటీ చేయగా, మిత్రపక్షం శివసేన 125 స్థానాల్లో పోటీ చేసింది.  


మహారాష్ట్రలో బీజేపీ సొంతంగా అధికారాన్ని ఏర్పాటు చేసి అవకాశం వచ్చినాగాని, బీజేపీ మిత్రపక్షం శివసేనతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.  కలిసే పనిచేసేందుకు సిద్ధం అవుతుంది. గత ముప్పై ఏళ్లుగా రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయి.  ఇప్పుడు కూడా కలిసే ఉన్నాయి.  బీజేపీ.. శివసేన బంధం ఫెవికాల్ కంటే బలమైనది.  ఆనాడు శివసేన అధినేత బాల్ థాకరే కుదిర్చిన మైత్రి, ముందుచూపు ఇప్పటికి అలానే కొనసాగుతున్నది.  


ఎన్డీయేకి మహారాష్ట్రలో 200 నుంచి 220 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నది.  గతంలో కంటే ప్రతిపక్షం మరింతగా బలహీనపడే అవకాశం ఉంది.  అలానే హర్యానాలో కూడా ఇదే విధమైన ఫలితాలు కనిపిస్తాయని అంటున్నారు.  అక్కడ బీజేపీకి 63 నుంచి 77 స్థానాల వరకు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉన్నది.  ఈ రెండు రాష్ట్రాల్లో విజయం సాధిస్తే.. బీజేపీ నెక్స్ట్ ఢిల్లీ, బీహార్ పై దృష్టి పెట్టె అవకాశం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: