ఈనెల 21 వ తేదీన హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక జరిగింది.  ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా గెలుపొందడంతో హుజూర్ నగర్ నియోజక ఎమ్మెల్యే పదవికి అయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు.  ఈ ఉప ఎన్నికల ఫలితం ఈరోజు రాబోతున్నది.  దీంతో పాటుగా దేశంలోని 51 అసెంబ్లీ నియోజక వర్గాలకు, మరో రెండు పార్లమెంట్ నియోజక వర్గాలకు కూడా ఉపఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే.  


ఈ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.  నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలోని వ్యవసాయ  గోదాములో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు.  కాగా, ఉదయం 8 గంటలకు అధికారుల సమక్షంలో ఈవీఎం లను బయటకు తీసి కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఫలితం వచ్చే అవకాశం ఉన్నది.  తుదిఫలితం కొంచం అటు ఇటుగా మధ్యాహ్నం 1 లేదా 2 గంటల వరకు అధికారికంగా ప్రకటిస్తారు.  


మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. హుజూర్ నగర్ లో విజయం తమదే అంటే తమదే అని కాంగ్రెస్, తెరాస లు పోటీ పడుతున్నాయి.  గతంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని, కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు.  అయితే, బీజేపీ, తెలుగుదేశం పార్టీకి చెందిన కొన్ని ఓట్లు ఎవరి ఓట్లు చీల్చారు అన్నది తెలియాల్సి ఉంటుంది.  


మరోవైపు తెరాస కూడా ఇదే ధీమాను వ్యక్తం చేస్తోంది.  హుజూర్ నగర్ అభివృద్ధి చెందాలి అంటే తెరాస పార్టీకి ఓటు వేయాలని, తెరాస కు ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని తెరాస పార్టీ ప్రచారం చేసింది.  ఆర్టీసీ కార్మికుల సమ్మె, తెలంగాణ బంద్ ఎఫెక్ట్ తెరాస పార్టీ విజయంపై ప్రభావం చూపుతుందా లేదా అన్నది తెలియాలి.  అటు హై కోర్టు కూడా తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో.. ప్రజలు ఆలోచనలో పడ్డారు.  తెరాస పార్టీకి ఓటు వేసే విషయంపై ఒకటికి నాలుగుమార్లు ఆలోచిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: