జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో  చంద్రబాబునాయుడు రాసిచ్చిన స్క్రిప్టునే  పవన్ కల్యాణ్ మాట్లాడేశారు. తాజాగా పవన్ మాట్లాడిన మాటల సారాంశం ఏమిటయ్యా అంటే వైసిపిని ఇన్ని సీట్లలో గెలిపించి తప్పు చేశామా ? అని జనాలు అనుకుంటున్నారట.  మరి తనకు అలా చెప్పిన జనాలు ఎవరో మాత్రం పవన్ చెప్పలేదు. ఇక్కడే స్క్రిప్టులో కొద్దిపాటి తేడా ఉంది.

 

చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా వైసిపిని ఎందుకు గెలిపించామా ? అని జనాలు అనుకుంటూనే మళ్ళీ తానే సిఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు.  నిజానికి చంద్రబాబు చెప్పినా పవన్ చెప్పినా అదంతా కేవలం అబద్ధాలే అని అందరికీ అర్ధమైపోతోంది.  చంద్రబాబుకు ఓట్లేసి గెలిపించాలని జనాలు అనుకుంటున్నదే నిజమైతే వైసిపికి 151 సీట్ల అఖండ మెజారిటి ఇవ్వరు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు, విమర్శలనే పవన్ కూడా ఫాలో అవుతున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. కాకపోతే  చంద్రబాబు మాటలను ఓ నాలుగు రోజుల తర్వాత పవన్ రిపీట్ చేస్తున్నారంతే. నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి దాడులను ప్రస్తావించారు. నిజానికి టిడిపి హయాంలో చింతమనేని, బోండా, కేశినేని లాంటి ప్రజాప్రతినిధులు అధికారులపై దాడులు చేస్తే కనీసం చంద్రబాబు మందలించను కూడా లేదు.

 

ప్రస్తుత ప్రభుత్వంలో దాడిచేశారన్న ఆరోపణలపై కోటంరెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు కూడా చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించలేదు కాబట్టి పవన్ కూడా చెప్పలేదు.   కేసులు బయటకు తీస్తారన్న భయంతోనే రాష్ట్ర ప్రాజెక్టుల గురించి కూడా జగన్ ప్రస్తావించటం లేదన్న చంద్రబాబు ఆరోపణలనే పవన్ రిపిట్ చేశారు. హోలు మొత్తం మీద చంద్రబాబు పాలనతో పోల్చిచూస్తే జగన్ పాలన చాలా బాగున్నట్లే అనుకోవాలి. కానీ చంద్రబాబు జేబులో మనిషి కదా అందుకనే విమర్శించాలనే పవన్ విమర్శిస్తున్నారంతే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: