ఇన్ని రోజులూ తెలంగాణ ప్రాంత ప్రజలంతా "ప్రత్యేక తెలంగాణ'' అనే అంశానికి కట్టుబడి ఉండేవారు. ఇక్కడి రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ డిమాండ్ ను ఎజెండా చేసుకొన్నాయి. ఇక్కడి రాజకీయ నాయకులంతా గత నాలుగు నెలలుగా తీవ్ర తెలంగాణ వాదులు అయ్యారు. అయితే.. ఇప్పుడు ఈ ప్రాంతంలో మార్పు కనిపిస్తోంది! కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్నగేమ్స్ తో తెలంగాణ పై తెలంగాణ ప్రాంతంలోనే ఏకాభిప్రాయం కుదిరేలా లేదు! కాంగ్రెస్ అధిష్టానం రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో వ్యవహరం రచ్చ రచ్చ అవుతోంది. రాయలతెలంగాణ గురించి తెలంగాణ వాదుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే తెలంగాణ వాదులంతా మండిపడుతున్నారు. అయితే కాంగ్రెస్ లోని తెలంగాణ వాదులు మాత్రం రాయలతెలంగాణకు అనుకూలంగా ఉన్నారట! అలాగే కులాల వారీగా కూడా రాయలతెలంగాణ అంశం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాయలతెలంగాణ వస్తే దాంతో తెలంగాణ ప్రాంతంపై రెడ్ల ఆధిపత్యం ఎక్కువ అవుతుందని తెలంగాణ ప్రాంత బడుగు, బలహీన వర్గాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు! తమకు సామాజిక తెలంగాణ కావాలని, అది పదిజిల్లాల తెలంగాణతో మాత్రమే సాధ్యం అవుతుంనది వారు అంటున్నారు. అగ్రకుల ఆధిపత్యంతో ఉన్న తెలంగాణ తమకు వద్దని వారు స్పష్టం చేస్తున్నారు! మరి ఈ పరిస్థితిని చూస్తుంటే.. ఇక రేపటి నుంచి తెలంగాణ ప్రాంతంలో కొత్త రచ్చ తీవ్రతరం అయ్యేలా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో రాయలతెలంగాణ అనుకూలంగా ఒక ఉద్యమం, వ్యతిరకంగా మరో ఉద్యమం మొదలయ్యేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: