మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడకం పెరిగిపోతోంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌కు మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 20 శాతం వృద్ధి చెంది 19.8 కోట్లకు పెరిగిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు 90 కోట్లుగా ఉన్న మొత్తం టెలికాం వినియోగదారుల్లో 87.33 కోట్ల మంది మొబైల్ వినియోగదారులున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసే వినియోగదారుల సంఖ్య మొత్తం వినియోగదారుల సంఖ్యలో 89%గా ఉంది. జూన్‌తో ముగిసిన 3 నెలల కాలానికి మొబైల్ డివైస్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసిన వినియోగదారుల సంఖ్య 17.6 కోట్లకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: