పది జిల్లాలతో కూడిన తెలంగాణకే మద్దతు పెద్ద ఎత్తున పలుకుతోంది. ఈ మేరకు ఈ రోజు క్యాబినెట్ లో ప్యూర్ తెలంగాణ బిల్లు ప్రవేశ పెడతారని సమాచారం. ఈ మేరకు జాతీయా మీడియాలో గురువారం మద్యాహ్నం నుంచి కథనాలు ప్రసారం చేస్తున్నాయి. దీనికి తగ్గట్టు పరిణామాలు కూడా చోటు చేసుకోవడంతో కేంద్రం తన రాయల తెలంగాణ ప్రతిపాదనను వెనక్కు తీసుకుంటోందని చెబుతున్నారు. కారణం ఏకంగా కీలకమైన మంత్రి ఆజాద్ రాయల తెలంగాణ వద్దంటూ ఏకంగా జిఓఎం కు సిఫార్సు చేస్తూ లేఖ ఇవ్వడం దీనిపై ప్రభావం చూపిందని అంటున్నారు. అంతే కాదు యూపిఏ మిత్రపక్ష నేత కేంద్ర మంత్రి అజిత్ సింగ్ కూడా పదిజిల్లాల తెలంగాణకే తాము మద్దతిస్తామని చెప్పారు. ఈ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పార్లమెంట్ కు రాదని కేంద్ర మంత్రి అజిత్ సింగ్ చెప్పారు. తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని కోరుతూ గురువారం ఆయనను తెలంగాణ జేఏసి నేతలు కలిసారు. పదిజిల్లాల తెలంగాణకే మద్దతివ్వాలని కోరారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తాము ఎప్పుడు తెలంగాణకు అనుకూలమే అని చెప్పారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణకే తాము మద్దతిస్తామని స్పష్టం చేసారు. రాయల తెలంగాణకు తాను అనుకూలం కాదని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లోనో, ప్రత్యేక సమావేశం పెట్టో తెలంగాణ బిల్లు తెస్తారని చెప్పారు. 2014 లోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని ఆయన భరోసా ఇచ్చారు. మరో వైపు తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్, బిజేపి తదితర పార్టీలన్నీ రాయల తెలంగాణను నిరసిస్తూ గురువారం పెద్ద ఎత్తున నిరసనలు తెలుపాయి, ఆందోళనలు చేసాయి. మరో వైపు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు గురువారం పార్టీ పెద్దలను కలిసి రాయల తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కోర్ కమిటీలో దీనిపై చర్చించి రాయల ప్రతిపాదనపై కాంగ్రెస్ వెనుకడుగు వేసిందన్న వార్తలు వెలుబడుతున్నాయి. ఇది ఎంత వరకు నిజమన్నది మరి కాసేపట్లో తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: