తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయింది. అయితే చీలినా కూడా రెండు చీలికలకు పేలికలా అల్లుకున్నది చంద్రబాబే కావడం విశేషం. మొత్తం మీద కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో దాదాపు సక్సెస్ అయింది. కాకపోతే జగన్ విషయంలో సాదించిన ఘనత మాత్రం చంద్రబాబు విషయంలో సాదించలేకపోయింది. అయితే ఇంకా సమయం ఉన్నందున జగన్ కు పట్టిన గతినే చంద్రబాబుకు కాంగ్రెస్ పట్టిస్తుందేమో అన్న అనుమానాలయితే ఇంకా ఉన్నాయి. సరే ఈ ముప్పు నుంచి చంద్రబాబు ఎలా తప్పించుకుంటారు అనేది ఎదురిచూడాలి. తెలంగాణ ఏర్పాటును సిడబ్ల్యూసి లో ప్రకటించి జగన్ పార్టీని తెలంగాణలో లేకుండా చేసింది కాంగ్రెస్. తెలుగుదేశం కూడా వాష్ అవుట్ అవుతుంది అనుకున్నా.. చంద్రబాబు తన చతురతతో రెండు ప్రాంతాల్లో నిలదొక్కుకున్నారు. అప్పటి నుంచి తెలంగాణలో తెలుగుదేశం ను పాతరేసేందుకు కాంగ్రెస్ టిఆర్ఎస్ తో కలిసి చేయని ప్రయత్నాలు లేవు. అయినా సరే చంద్రబాబు వారి పాచికలు పారనీయలేదు. అయిన పట్టువదలని విక్రమార్కుని వలే ప్రయత్నాలు సాగించి ఎట్టకేలకు పార్టీని మాత్రం తెలంగాణ, సీమాంద్రగా రెండుగా చీల్చింది కాంగ్రెస్. తెలంగాణ ప్రకటనతో విడిపోలేదు కాని తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి టిడీపిని చీల్చేసింది. ఈ సంధర్భంగా టిడిపి వారే రెండుగా చీలిపోయి కొట్టుకున్నారు. అంతే కాదు మంగళవారం జరిగిన బిఏసి సమావేశంలోను తెలంగాణ పై చర్చ పెట్టాలని నిర్ణయిస్తే సీమాంద్ర టిడిపి సభ్యులు సమావేశాన్ని బైకాట్ చేస్తే, తెలంగాణ టిడిపి సభ్యులు మాత్రం మద్దతు తెలిపి సమావేశంలోనే ఉండిపోయారు. అంటే తెలుగుదేశం రెండుగా చీలిపోయిందన్న మాటే. అయితే తెలంగాణలో వైఎస్సార్ సిపి పార్టీనే లేకుండా పోయింది, కాని టిడిపి మాత్రం తెలంగాణలో ఇంకా ఉంది, అంతేకాదు వారు కూడా చంద్రబాబునే బాస్ గా గుర్తిస్తున్నారు. ఎందుకంటే తాజాగా ఎర్రబెల్లి తెలంగాణ బిల్లు విషయంలో చంద్రబాబును వెనకేసుకు రావడమే దీనికి నిదర్శనం. అయితే మున్ముందు ఏమైనా జరగొచ్చు అన్న భావమైతే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: