ఓరచూపులు విసరడంలో ఆరితేరింది. కనుసైగలతోనే కసిగా కవ్వించి మత్తెక్కిస్తుంది మగాళ్ళను తనముగ్గులోకి దింపి పెళ్లిపేరిట అందినకాడికి దుండుకుంటుంది. కాగా ఆమె పవిత్రమైన పెళ్ళిని వ్యాపారంగా ఎంచుకుంది. తన విలాసాల కోసం వేదమంత్రాలను పలుమార్లు నడివీధిపాలుచేసింది. ఉంగరాలు మార్చుకోవడంలో ఉద్దండురాలైంది. దండలు మార్చుకోవడంలోనూ ఆరితేరింది. తలవంచి కట్టించుకున్న తాళిని ఎగతాళిచేయనారంభించింది. బహుభర్తలతో వివాహబంధం కొనసాగించేందుకు బరితెగించింది. ఒకరుకాదు ఇద్దరు కాదు ఏకంగా యాభైమందితో పొందు ఎట్టకేలకు కట్టుకున్నోళ్ళు కనిపెట్టేసరికి కటకటలపాలైంది. ‘ పాంచ్’ ఆలినేనని షేహనాజ్ నమ్మబలుకుతోంది. ఖాకీల రంగప్రవేశంతో షెహనాజ్ షాదీల భాగోతం వెలుగులోకి రావండంతో ఆమె ఫఛ్చాస్సాలీ అని తేలిపోయింది. ఇక ఆమెగారి వివిధ వివాహాల వివరాల్లోకి వెళితే.... షెనాజ్ది కేరళరాష్ట్రంలోని కేశవపురం పైటవేసిందే మొదలు పెళ్ళిళ్లకు తయారైపోయింది. తన పదిహేనేళ్ళ వయసులో సిద్ధిఖ్ అనే యువకున్ని తనబుట్టలో వేసుకుంది. ఈపై ఆ యువకున్ని వివాహం చేసుకుంది. వీరి దాంపత్య ఫలితం ఓ పాప జన్మించింది. ఈక్రమంలో మరో పెళ్లి చేసుకోవాలని తలచింది. షెహనాజ్ తలచిందే తడవుగా అదే రాష్ట్రానికి చెందిన షానవాజ్ అనే యుకునికి వలపులవల విసిరింది. ఇంకేముంది. సదరు షానవాజ్ సైతం వచ్చి ఒళ్లో వాలిపోయాడు. తదనంతరం వీరిద్దరికీ వివాహం జరిగిపోయింది. మొదటిభర్తకు తెలియకుండానే గుట్టుగా రెండోభర్తతో సంసారం సాగించింది. ఇద్దరు భర్తలకు తెలియకుండా ముచ్చటగా మరో వికాలాంగుడిని వివాహమాడింది. కొంతకాలం తరువాత పలు వస్త్రదుకాణాల్లో పనిచేసింది. షాపింగ్ వచ్చే యువకులకు తనదైన శైలిలో వలపులు విసిరింది. దీంతో చైన్నైకి చెందిన మణికంఠన్ షెహనాజ్ వలలోపడి తన తల్లిదండ్రులను కాదని మతాంతర వివాహం చేసుకున్నాడు. కాగా వీరి వివాహనికి కొందరు సినీ, పారిశ్రామిక వేత్తలు హాజరుకావడం కొసమెరుపు. ఒకరికి తెలియకుండా ఇంకొకరితో సంసార జీవితం సాగిస్తూవచ్చింది. కాలక్రమంలో ఓ ఫుట్బాల్ క్రీడాకారుడు, శరవణ అనే వ్యక్తిని సైతం వివాహం చేసుకుంది. చదువు క్యాంపులంటూ రోజు తరబడి ఇంటికి రాకపోవడంతో శరవణకు అనుమానం కలిగింది. దీంతో తన భార్య కనిపించడంలేదంటూ చెన్నై కమీషనర్ త్రిఫాఠిని సంప్రదించాడు. అప్పటికే ఇలాంటి ఫిర్యాదే అతనికి అందటంతో కమీషనర్ కంగుతిని షెహనాజ్ భర్త చిట్టాపై ఆరాతీయడంతో విచారణ ప్రారంభించడంతో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఈ క్రమంలో షెహనాజ్ ఫోటో పత్రికల్లో ప్రచురించడంతో బిలబిలమంటు దాదాపు 48 మంది భర్తలు కమీషనర్ కార్యాలయంలో ముందు బారులుతీరారు. ఆపై తనను ఇలా మోసం చేసిందంటూ కొందరు. అలా మోసగించిందని మరికొందరు కమీషనర్ ముందు తమగోడును వెల్లబుచ్చారు. విషయం వెలుగుచూడటంతో సదరు పెళ్లిళ్ల కిలాడీ చెన్నైనుంచి చెక్కేసి వేలూరు, హుసూరు చేరుకుని అటునుంచి ఆంధ్రప్రదేశ్ కు చేరింది. ఖాకీలు పలుమార్లు ఆమె ఫోన్ నెంబర్కు ఫోన్ చేయగా స్విఛ్చాఫ్ అని సమాధానం వచ్చింది. కాగా ఒక్కసారి రింగ్ కావడం, పోలీసు అధికారులు ఆమెతో మాట్లాడటం జరిగాయి. అయితే వారి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ఎటంటే, తాను ఆర్థికంగా ఎదగటం కోసం పెళ్ళిళ్ళను వ్యాపారంగా మార్చానని, ఈక్రమంలో తాను ఏడు నుంచి ఎనిమిది మందిని వివాహం చేసుకున్నానని,, మిగిలిన ఇంకొందరితో సహజీవనం చేశానని షెహనాజ్ సెలవిచ్చింది. ఏమహిళైనా 50 మందిని వివాహం చేసుకోగలదా ; అంటూ ఆమె పోలీసులకు అసహనంగా సమాధానం ఇచ్చిందట.  ఆపై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం, చెన్నైలోని ఫుళల్ జైలుకు తరలించడం జరిగిపోయాయి. కాగా ప్రస్తుతం జైలులో ఉన్న షెహనాజ్ నాలుగు నెలల గర్భవతి. తన బిడ్డకోసమైనా తనకు బెయిల్ ప్రసాధించాలని కోర్టువారిని షెహనాజ్ వేడుకుంటోంది. ఇదిలావుండగా తన కడుపులో ఉన్న బిడ్డ ఎవరికి సొంతం అన్నది బహుభర్తల మధ్య బహిరంగ చర్చమొదలైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: