జగన్ ఒంటరిగా మారి విభజన రాజకీయంలో అడ్డంగా బోల్తాపడతారా, లేక ఘన విజయం సాధించి అంతా తనొక్కని ఖాతాలోనే వేసుకుని ఒన్ మెన్ ఆర్మీ అని నిరూపించుకుంటారా అన్నది త్వరలోనే తేలనుంది. మొత్తానికి తానొక్కడు మాత్రమే సమైక్య హీరోగా నిలవాలన్న కోరికకు అందరు ఆయనకు బాసటగా నిలవడం మాత్రం విశేషం. అదేంటి అంత చక్కటి అవకాశాన్ని ఆయన ప్రత్యర్థులు నిజంగా అవకాశం ఇచ్చారా, లేక ఆయనను అమాంతంగా పడేయాలని ప్లాన్ వేసారా అన్నది కూడా త్వరలోనే తేలుతుంది అంటున్నారు. అదేంటంటే తెలంగాణ బిల్లు అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఇన్నాళ్లు సమైక్య హీరో రేసులో జగన్ తో పాటు ఉన్న ముఖ్యమంత్రి బిల్లు చర్చకు రావడంతో దాదాపు ఆరేసు నుంచి అవుట్ అయ్యారు. ఇక అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చకు రాకుండా జగన్ పార్టీతో పాటు అడ్డుకుంటూ సీమాంద్ర కాంగ్రెస్, సీమాంద్ర టిడిపిలు పోటీ పడ్డాయి. అయితే అవి కూడా ఆపోటీ నుంచి తప్పుకున్నాయి. వారు కూడా తెలంగాణ బిల్లుపై జనవరి మూడు నుంచి నిర్వహించనున్న సమావేశాల్లో చర్చిస్తామంటూ ప్రకటించారు. ఇక సమైక్యం కోరుకుంటున్న వాటిలో లోక్ సత్తా, సిపిఎం, లోక్ సత్తాలు మిగిలాయి. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ ఎప్పుడో చెప్పేసారు చర్చ జరపకుంటేనే సీమాంద్రకు నష్టమని, అంటే ఆయన చర్చలో పాల్గొంటున్నారన్న మాట. ఎఐఎం ఎప్పుడో మాటను మార్చింది, పైగా తెలంగాణ బిల్లులో దానికి పెద్ద అభ్యంతరాలు లేవు, కేవలం హైదరాబాద్ శాంతిభద్రతలపై గవర్నర్ పెత్తనం తప్ప, కాబట్టి అది కూడా చర్చకు ఓకే చెప్పింది. ఇక మిగిలిన సిపిఎం తాజాగా సమావేశం అయి తెలంగాణ బిల్లుపై చర్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు బిల్లులోని అంశాల వారీగా చర్చించే విషయాలను అద్యయనం చేయడం ప్రారంభించింది. అంటే తెలంగాణ బిల్లు చర్చకు రాకుండా అడ్డుకునేందుకు జగన్ ఒక్కడే మిగిలారన్న మాట. ఈ విషయంలో గెలిచాడనుకో ఒన్ మెన్ ఆర్మీ అంటూ క్రెడిట్ కొట్టేస్తారు జగన్, లేదా ఒంటరిగా మిగిలిపోయి అడ్డంగా బోల్తాపడతారు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: