ఇప్పటికే ఎన్నో కేసుల్లో ఇరుక్కుని ఓ సారి జైలుకు వెల్లి బెయిల్ పై బయటకు వచ్చి వాటిని కోర్టులో ఎదుర్కుంటున్న జగన్ మరో ప్రమాదంలో ఇరుక్కున్నారు. భారతదేశం, భారత రాజ్యాంగం అత్యంత సీరియస్ నేరంగా భావించే విషయంలో ఆయనపై కేసు నమోదయింది. ఇది కనుక రుజువైతే జగన్ నిజంగా ప్రమాదంలో పడ్డట్టే అంటున్నారు. జాతీయగీతాన్ని అవమానించారంటూ జగన్ పై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. హైదరాబాద్ లో జరిగిన సమైక్య సభలో జనగణమన జాతీయగీతాన్ని తప్పుల తడకగా, అడ్డదిడ్డంగా ఆలపించారు. ఇది అన్ని టివి న్యూస్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. దీనిపై పలుమీడియాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. దీని ఆదారంగా చేసుకుని రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ వేసారు న్యాయవాది జనార్దన్ గౌడ్. దీంతో న్యాయస్థానం ఆదేశాలమేరకు సరూర్ నగర్ పోలీసులు జగన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. దీంతో జగన్ మరోసారి ఓ కొత్త చిక్కుల్లో పడ్డట్టయింది. కారణం జాతీయగీతాన్ని అవమానించడం నేరంగా భావిస్తుంది మన భారతజాతి, రాజ్యాంగం కూడా కఠినంగా శిక్షించాలని చెబుతోంది. అయితే గతంలో ఇలాంటి కేసులు ఎంతో మందిపై నమైదైనా కూడా వారి పలుకుబడితో ఆదారాలు లేకుండా బయటపడ్డారు. ఇప్పుడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యక్ష ప్రసారాలు కారణంగా ఆదారాలు ఇట్టే దొరికిపోతాయి. అందుకే జగన్ ప్రమాదంలో పడ్డారు అంటున్నారు. మరో వైపు స్పీకర్ ను ఉద్దేశించి కూడా జగన్ చేసిన అనుచిత వాఖ్యలపై ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారి చేయనున్నట్లు ప్రభత్వ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు. అంటే జగన్ కొత్త చిక్కుల్లో పడుతున్నారన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: