తెలంగాణ కోసమై కాంగ్రెస్ తెలివైన ఆటను మొదలు పెట్టింది. ఠాగూరు సినిమాలో చనిపోయిన బాడీని ఓ కార్పోరేట్ ఆసుపత్రికి చిరంజీవి తీసుకువస్తే అక్కడ ఆయనను బతికించడానికి డాక్టర్లు, సిబ్బంది ఎంత హడావిడి, డ్రామాలు చేసి చివరకి సారీ చాలా ట్రై చేసాం,కాని బతికించలేకపోయాం అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ బ్యాట్స్ మెన్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలంతా తెలంగాణ బిల్లును సజావుగా ముందుకు తీసుకుపోవడం, సమైక్య స్టార్ బ్యాట్స్ మెన్ కు చెడ్డపేరు రాకపోగా, ఆయనకు ఎంతో చేసాడు అన్న పేరును సీమాంద్రలో తెచ్చిపెట్టడం కోసం ఉత్తుత్తి డ్రామాలు బిల్లు పై చర్చ ప్రారంభం అవుతున్న సంధర్భంగా మొదలు పెట్టారు అన్న వాఖ్యలు ఎన్నికలు ముంచుకు వస్తుండడం, తెలంగాణ బిల్లు సజావుగా అసెంబ్లీని దాటాల్సి ఉండడంతో కాంగ్రెస్ తన గేమ్ లో స్పీడ్ ను పెంచింది. సహకరిస్తున్న ముఖ్యమంత్రిని గట్టున పడేయడం, అవసరానికి ఉపయోగపడే ఉద్యోగులను చేరదీయడం వంటి వాటికి పార్టీ శ్రీకారం చుట్టింది. అంతా అయిపోయాక శ్రీదర్ బాబు శాఖను మార్చి దానిని రాజకీయంగా నానా యాగి చేసారు. ఇప్పుడు ఆ పని ముఖ్యమంత్రి సీమాంద్ర క్షేమంకోసమే చేసారని తెగ ప్రచారం చేసే పనిలో కాంగ్రెస్ తన కంత్రీ గేమ్ ప్లాన్ ను అమలు చేస్తోంది అంటున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి ఏంచేసినా ఏమి మాట్లాడని అధిష్టానం ఇప్పుడు సిఎం శ్రీదర్ బాబు శాఖా మార్పుచేయడంతో ఆయనేదో తెలంగాణకు అడ్డుపుల్ల వేస్తున్నారు, దీనిని అడ్డుకోవాలి అంటూ ఏఐసిసి కార్యదర్శిని హైదరాబాద్ కు పంపించి పసందైన డ్రామాను మొదలుపెట్టింది. ఆయన వచ్చి రాగానే ముఖ్యమంత్రి కి అధికారాలున్నాయంటూనే ఈ సమయంలో చేయకూడదంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. మరో పక్క శ్రీదర్ బాబు, జానారెడ్డిలతో భేటి అయ్యారు. ఇలా అటూ ఇటూ తెగ సంప్రదింపులు జరుపుతూ ముఖ్యమంత్రి కిరణ్ సమైక్యం కోసం ఇదంతా చేసాడన్న దానిని, దానిని తెలంగాణ వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అన్న వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకుపోతారన్న మాట. అంటే దీనివల్ల ముఖ్యమంత్రిపై పడ్డ అపవాదునుంచి ఆయనను బయటపడేసి, ఇక అసలైన సమయంలో అంటే పార్టీ నుండి వెల్లిపోయి కొత్త పార్టీ పెట్టి సీమాంద్రలో తమకోసం ఇక ముందుకు పోవడానికి అడ్డంకులను తొలగించడంలో భాగమే ఇదంతా అన్న ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఇన్నాళ్లు ముఖ్యమంత్రి వెనుక ఉండి నడిపించిన ఏపిఎన్జీఓల మద్దతు కూడా సంపూర్ణంగా కిరణ్ కుమార్ రెడ్డికి ఉండడం కోసం వారి ఐఆర్ ను ఇతర కోరికలను కూడా ఆఘమేఘాల మీద తీరుస్తుండడం కూడా కాంగ్రెస్ పొలిటికల్ గేమే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: