జగన్ ను సీమాంద్రలో హీరో చేసేందుకే ముఖ్యమంత్రి కిరణ్ ఇప్పుడు ఈ కిరికిరి పెడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ ను జీరో చేసి, తాను సీమాంద్రలో హీరోను, స్టార్ బ్యాట్స్ మెన్ కావాలని ఆయన కష్టపడుతున్నారు. అందుకోసమై ముఖ్యమంత్రి పదవిని కూడా ఖాతరు చేయకుండా అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారు, రేపో మాపో పార్టీకి గుడ్ బై చెప్పి కొత్తపార్టీ కూడా పెడుతున్నారు కదా, అలాంటిది ఆయన తనకోసం కాకుండా తన ప్రత్యర్థి అని భావిస్తున్న జగన్ కోసం ఇంతగా ఎందుకు కష్టపడుతారు అన్న భావం కలగడంలో తప్పులేదనుకోండి, కాని అదేదో తెలిస్తే నమ్ముతారేమో మీరే చూడండి..... నిజానికి సోనియాగాంధీ కూడా విభజన అంశాన్ని ఓ ప్రాంతంలో కాంగ్రెస్ కు, సీమాంద్రలో జగన్ కు అనుకూలంగా మలిచేందుకు చేస్తుందని ముందునుంచి ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అదేంటంటే విభజన నిర్ణయం తీసుకుని జగన్ ను వన్ సైడ్ గా సీమాంద్రకు పంపించి అక్కడ ఆయనను హీరోగా చేసి ఎన్నికల తర్వాత కలుపుకుని లబ్దిపొందాలన్నది సోనియా – జగన్ ల డీల్ అంటూ వార్తులు వెలుబడ్డ విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలే బహిరంగా ప్రకటించారు కూడా. ఇప్పుడు ప్రక్రియ అంతా అదే విదంగా ముందుకుపోతోందని, అంతిమంగా జగన్ ను సీమాంద్రలో హీరోను చేసి విభజన చేసేసి తెలంగాణలో తాను లబ్దిపొందే దిశగానే కాంగ్రెస్ ముందుకుపోతోందని తెలుస్తోంది. దీనికి ముఖ్యమంత్రి కూడా లోపాయికారిగా చాలా పకడ్బందీగా ఎవరికి అనుమానం రాకుండా తన పనితాను చేసుకుపోతున్నారు అంటున్నారు. నిజం నిప్పులాంటిది, ఎన్నటికైనా బయటపడుతుంది అంటారు కదా.. ఇప్పుడు అది బయటపడబోతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కారణం తెలంగాణ బిల్లుపై అతికీలకమైన దశ శుక్రవారం నుంచి అసెంబ్లీలో ప్రారంభం కాబోతున్న సందర్భంగా కాంగ్రెస్ ఆడుతున్న నాటకం తెలంగాణ బిల్లును ముందుకు కదిలించడం, అదే తరుణంలో జగన్ ను సీమాంద్రలో మరింత హీరోను చేయడం వైపే అడుగులు పడుతున్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది అంటున్నారు. కారణం ముఖ్యమంత్రి తాను ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేసారు. అది తెలంగాణ మంత్రి శ్రీదర్ బాబు నుంచి శాసనసభ వ్యవహారాల బాద్యతను తొలగించారు. ఇది శైలజానాథ్ కు అప్పగించి అసెంబ్లీలో ఏంచేయాలని నిర్ణయించారు. అంటే తెలంగాణ బిల్లుపై సమగ్ర చర్చ జరపాలని, తద్వారా క్లాజుల వారిగా వ్యతిరేకించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి కిరణ్. అంటే తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతుందన్న మాట. అంటే తెలంగాణ బిల్లు సజావుగా ముందుకుపోతుంది. అంతే కాదు దీంతో పాటు మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేంటంటే శైలాజానాథ్ ద్వారా సభలో సమైక్య తీర్మాణం చేయించాలని. సరే దీనిని చేయకుండా తెలంగాణ వారు అడ్డుకుంటారా, లేక నిబందనలు ఒప్పుకోక నిలచిపోతుందా అనేది పక్కన బెడదాం. అయినా సరే ఏదైనా ప్రత్యేక క్లాజులు ఉపయోగించి సమైక్య తీర్మాణం పెట్టినా కూడా దాని క్రెడిట్ ఎవరికి పోతుంది. అంటే ఎవరైన టక్కున అది జగన్ కే దక్కుతుందంటారు. కారణం ఆయన సమైక్య తీర్మాణం చేసి పంపాలనిఎంతోలంగా కోరుతున్నారు. దీనికోసం ఆయన గవర్నర్ ను రెండుసార్లు, ముఖ్యమంత్రిని ఒక్క సారి కలిసి నివేదించారు. అయినా కూడా అప్పుడు చేయలేదు. సమైక్య తీర్మాణం చేయాలంటూ ఆయన ప్రజల్లో కూడా ఎంతో ప్రచారం చేసారు. అప్పుడు చేయకుండా ఇప్పుడు అంతా చేయిదాటాకా చేస్తున్నారంటే జగన్ మాట వినుంటే సీమాంద్రకు మేలు జరిగేది అన్న భావం సీమాంద్రలో కలుగుతుంది. జగన్ సమైక్యాంధ్రకోసం నిజమైన వ్యూహాలు వేసినప్పటికి కాంగ్రెస్ కావాలనే విభజన కోసం ఇదంగా చేసిందంటారు. ముఖ్యమంత్రి కూడా ఆడింది డ్రామాలే అంటారు. పలితం క్రెడిట్ అంతా జగన్ ఖాతాలోనే పడుతుందన్నమాట. అందుకే సోనియా తెలంగాణ ఏర్పాటు విషయంలో ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారమే ముందుకు పోతోంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: