ఇన్నాళ్లు జైతెలంగాణ, జై సమైక్యాంధ్ర అనకుండా అసలు తనేంటో ఎవరికి అర్థం కాకుండా తనది హోల్ ఆంద్రప్రదేశ్ వాదమని తెగ నమ్మించే ప్రయత్నం చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు బాగోతం ఎట్టకేలకు బయటపడింది. సేమ్ టు సేమ్ జగన్ – సోనియా డీల్ బాగోతాన్ని వైఎస్సార్ సిపి నేతలే ఎలా బయటపెట్టుకున్నారో, ఇప్పుడు చంద్రబాబు బాగోతాన్ని కూడా టిడిపి నేతలే బయటపెట్టడం విశేషం. దీంతో ఇక చంద్రబాబు అసలు రంగు బయటపడినట్టేనని, కేసిఆర్ తెలంగాణ టిడిపి నేతలను ఉద్దేశించి అన్న మాటలు కూడా అక్షర సత్యాలేనని బాబు మనుషులే బండారం బయటపెట్టారు. చంద్రబాబు సీమాంద్ర నేత అని ఆయనది సమైక్యవాదమని టిఆర్ఎస్ తో సహా తెలంగాణ వాదులు గగ్గోలు పెడితే పాపం తెలంగాణ టిడిపి నేతలు మాత్రం మాబాబు తెలంగాణకే అనుకూలం అంటూ ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవంత్ రెడ్డి వంటి గొంతు బొంగురుపోయే దాకా అరచి గీపెట్టారు. ఇప్పుడు వారికి ముఖం ఎక్కడ పెట్టుకుంటారో అన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి. కారణం తాజాగా జర్నలిస్టులతో మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న టిడిపి సీమాంద్ర ఎంపీలు బహిరంగంగా బాబు బాగోతం ఇదే అని చెప్పేసారు. చంద్రబాబు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసమే కృషి చేస్తున్నారట. అంతే కాదు ఆయన వద్ద తెలంగాణను అడ్డుకునేందుకు అసలైన అస్త్రశస్త్రాలు కూడా ఉన్నాయని చెప్పారు. సీమాంద్ర ఎంపీలతో సమైక్య ఆందోళన చేయిస్తున్నదే చంద్రబాబు అని, ఆయన వెనుకాల ఉండి తమతో వ్యూహాత్మకంగా లొల్లి చేయిస్తున్నారని కూడా చెప్పారు. మరి చంద్రబాబేంటి ఇప్పటికి అటు జగన్ ఇటు కేసిఆర్ గొంతు చించుకుని ఆయనది ఏవాదమో ఆయనకే తెలియదు అంటూ గగ్గోలు పెడుతున్నారు కదా... తిరుపతి, ఒంగోలు ప్రజాఘర్జనల్లో కూడా జై సమైక్యాంధ్ర అనలేదు సరికదా, విభజనకు అనుకూలమే అన్న అర్థం వచ్చేలా మాట్లాడారు అంటూ జగన్ దుమ్మెత్తి పోసినా అసలు విషయం ఎందుకు బయట పెట్టడం లేదు అని అడిగారు ఆంద్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీమాంద్ర ఎంపీలను. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు సుజనాచౌదరి, శివప్రసాద్, కిష్టప్ప, కొణకళ్ల నారాయణ తదితరులు అవును నిజమే ఆయన తండ్రి పాత్రలో ఉన్నారు కాబట్టి బయటకు రావడం లేదు, తన అసలు రూపం బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు అన్న నిజాన్ని కూడా తడుముకోకుండా చెప్పేసారు. దీంతో ఇప్పుడు ఆయన అసలు స్వరూపం తెలిసిన తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి. కాని ఇక్కడ కూడా ఓ వండర్ జరగొచ్చు, అదేంటంటే తెలంగాణ తమ్ముళ్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నిజంగా ఏపి కి తండ్రిలాంటి వారు, ఆ ప్రాంతం నేతలు చిన్న బుచ్చుకోకుండా ఉండేందుకు వారితో అలా నాటకం ఆడుతున్నారు కాని ఆయన తెలంగాణకు అనుకూలమే అని, సరే ఏం జరుగుతుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: