ఈ విశాల భారతంలో ఎక్కడున్నది మనకి స్వాతంత్ర్యం అక్రమాల, ఆక్రమణల మధ్య నడుస్తోంది మన జీవనం అనునిత్యం ప్రజలా ప్రభుత్వాలా ఎవరివల్ల పెరుగుతుంది నేరస్థుల్లో ఈ పైత్యం న్యాయం, ధర్మం సైతం వీరివల్ల నిజరూపాన్ని కోల్పోతున్నాయన్నది ఒప్పుకోలేకున్నా..సత్యం మనకి కావాలి న్యాయం కానీ.. మన గుమ్మందాటి అడుగువేయం మనకి కావాలి సరైన నాయకత్వం కానీ.. డబ్బు తీసుకోకుండా ఓటు వేయం మనకి కావాలి స్వాతంత్ర్యం కానీ..మన బంధాల, ఆంక్షల పరిధి దాటి బయటకిరాలేం మనకి కావాలి అవినీతిలేని సమాజం కానీ..పని సులభం అవటానికి లంచమివ్వకుండా ఉండలేం అందుకే..కాదీ దుర్భర సమాజం రాజకీయనాయకుల మహాభాగ్యం ఇది మన నుదుటిన మన స్వంత చేతులతో మనం రాసుకున్న దౌర్భాగ్యం.....

మరింత సమాచారం తెలుసుకోండి: