రాష్ట్ర విభజన విషయం గురించి చర్చ జరుగుతున్న అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ద్విపాత్రాభినయం చేస్తోంది. ఒకో రోజు ఒక్కో ప్రాంతం తరపున చాలా సమర్థవంతంగా వాదన వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇక చాలు రాష్ట్రాన్ని విడదీసేద్దాం అని ఒకరోజు, లేదు లేదు రాష్ట్రం కలిసుండాల్సిందేనని మరో రోజు తెలుగుదేశం తరపున వాదనలు వినిపిస్తున్నాయి. సీమాంధ్రలు అంతా దోపిడీ దారులు అంటూ ఒకరోజున, తెలంగాణ వాదులు చేస్తున్న దోపిడీ మాటేంటి? అంటూ మరో రోజున తెలుగుదేశం పార్టీ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సమైక్యవాదానికి గానీ ప్రత్యేక వాదానికి గానీ కట్టుబడలేకపోతున్న తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో కూడా ఏకాభిప్రాయాన్ని వినిపించలేకపోతోంది. ఒక రోజున తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు రాష్ట్ర విభజన కు అనుకూలంగా మాట్లాడతారు. మరో రోజున తెలంగాణ డిమాండ్ చాలా అన్యాయమైనది, చంద్రబాబు పాలనలో సమన్యాయంజరిగింది అని సీమాంధ్ర ప్రాంత నేతలు చెబుతారు. అయితే తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబు పాలన గురించి మాట్లాడరు! తెలుగుదేశం హయాంలో ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో జరిగిన కుంభకోణాల గురించి కూడా తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు ప్రస్తావిస్తూ సీమాంధ్రులు దోపిడీ దారులు అని వారు అంటారు. ఈ విధంగా డ్యూయల్ రోల్ ను చాలా సమర్థవంతంగా పోషిస్తోంది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ డిమాండ్ ను తెలుగుదేశం నేతలే చేస్తున్నారు, ఆ డిమాండ్ అర్థం లేనిదని కూడా టీడీపీ నేతలే మాట్లాడుతున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో బాబు ఏం చేస్తున్నాడయ్యా ?అంటే.. ఆయన మారు మాట్లాడటం లేదు. అసెంబ్లీకి వచ్చినా అందరి ప్రసంగాలు వింటూ మౌనంగా ఉంటున్నాడు తెలుగుదేశం అధినేత. తన పార్టీ నేతలే రెండు వాదాలనూ వినిపిస్తుంటే వాటిని విని ఎంజాయ్ చేస్తున్నాడు తెలుగుదేశం అధినేత! మరి ప్రజలు దీని గురించి ఏమనుకొంటున్నారో!

మరింత సమాచారం తెలుసుకోండి: