రాష్ట్ర అసెంబ్లీ పునర్వ్యస్థీకరణ బిల్లును తిరస్కరించినా మాకేం ప్రాబ్లమ్ లేదు అని అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ విభజనకు ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయంతో పనేలేదు అని అంటున్న కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేస్తానని అంటోంది. రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయంతో పనిలే కుండా విభజన జరిగిపోతుందని, దీనికి చట్టం అనుమతిని ఇస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించాడు. మరి సీమాంధ్ర కాంగ్రెస్ వాళ్లు ఈ పరిణామాన్ని ఎలా ఎదుర్కొంటారు? విభజన ఆగదని అంటున్న కేంద్ర ప్రభుత్వానికి ఎలా సమాధానం చెబుతారు? అనే విషయం ఆసక్తిదాయకంగా మారింది. ఈ విషయం గురించినే "ఏపి హెరాల్డ్.కాం'' కొంతమంది సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతల వద్ద ప్రస్తావించింది. విభజనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కుతగ్గను అని అంటోంది కదా.. మీరేం చేయబోతున్నారు? అని వాకబు చేసింది. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించారు. తాము కేంద్ర ప్రభుత్వంపై మళ్లీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామని వారు ప్రకటించారు. తమకు చాలా మంది ఎంపీల బలం ఉందని, ఈ సారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తామని వారు అన్నారు. దీంతో తెలంగాణ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. మరి ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం పడిపోతే తెలంగాణ బిల్లు ఎక్కడిక్కడ ఆగిపోతుందని అనుకోవచ్చు. అయితే.. నిజంగానే సీమాంధ్ర ఎంపీలకు అంత సీన్ ఉందా? అనేది అనుమానాస్పదమైన విషయమే. సీమాంధ్రలోని అందరు ఎంపీలు కూడా అవిశ్వాసానికి కట్టుబడి ఉండటం లేదు. కేవలం ఆరు మంది ఎంపీలు మాత్రమే అవిశ్వాస తీర్మానం అని అంటున్నారు! అయితే తమకు వేరే పార్టీ ఎంపీల మద్దతు ఉందని వారు చెబుతున్నారు. మొత్తం 80 మంది తమకు సపోర్ట్ చేస్తారని వారు అంటున్నారు. మరి నిజంగానే సీమాంధ్ర ఎంపీలకు అంత శక్తి ఉందా? అధిష్టానాన్ని డేర్ చేసేంత సీన్ ఉందా? వీరి ధాటికి కేంద్ర ప్రభుత్వం పడిపోతుందా? తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: