కేంద్రంలో అధికారంలోకి వచ్చే కూటమిపై మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి దృష్టిపెట్టినట్టుగా ఉన్నాడు. అధికారంలోకి వచ్చే కూటమిలో చేరిపోవడమే తప్ప.. ఆయనకు వేరే ఐడియా లేనట్టు కనిపిస్తోంది. తాజాగా మూడో కూటమి సమావేశం జరిగిన నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఆ కూటమి గురించి మారు మాట్లాడకపోవడాన్ని బట్టి ఈ విషయంపై క్లారిటీ వస్తోంది. తన పార్టీ తరపున తెలంగాణ నుంచి గెలిచే ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులను ఇప్పిస్తానని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాడు. దీన్ని బట్టి ఆయన కేంద్రంలో అధికార కూటమిలో భాగస్వామిని అవుతాననని చాలా నమ్మకంతో ఉన్నానని అనుకొంటున్నాడని చెప్పవచ్చు! ఆది నుంచి జగన్ మోహన్ రెడ్డి కేంద్రమంత్రి పదవుల విషయంలో చాలా స్పష్టతతో ఉన్నాడు. రాష్ట్రానికి వ్యవసాయ శాఖమంత్రి, రైల్వేశాఖ మంత్రి వంటి వాటిని తీసుకొస్తానని అంటున్నాడు. తాజాగా తన పార్టీ వాళ్లకు కూడా జగన్ ఇవే హామీలను ఇస్తున్నాడు. అంటే జగన్ కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వస్తే దాంట్లోకి చేరిపోవాలని చాలా బలంగా ఫిక్సయ్యాడని అనుకోవాల్సి వస్తోంది. ఇక తాజాగా మూడో కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా మంది ప్రాంతీయ పార్టీ నేతలు పాల్గొన్నారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో మొత్తం 11 పార్టీలు ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ కూటమి ఎన్నికల ముందు వరకే నిండుగా కనిపిస్తుంది. ఎన్నికల తర్వాత ఈ కూటమి చెల్లా చెదురవుతుందని భావింవచ్చు! ఈ కూటమిలో చేరే నేతలెవ్వరికీ స్టెబిలిటీ లేదు. ఇలాంటి కూటమి గురించి ఆహ్వానం లేకపోవడమే మంచిది అని జగన్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది తమ మంచికేనని తాము ఫ్రీబర్డ్ లా ఉంటామని, ఎన్నికల తర్వాత నిర్ణయాన్ని తీసుకొంటామని వైకాపా నాయకులు చెబుతున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: