పుత్రరత్నం చాలా కష్టపడి చదివి పరీక్ష రాసి ఇంటికొచ్చాడు. తన బిడ్డ విజయాన్ని కాంక్షిస్తూ రోజులు గడుపుతున్న తండ్రికి కొన్ని రోజుల తర్వాత తెలిసింది వాడు సఫలీకృతుడు కాలేక పోయాడని. కానీ.. వాడికన్నా ఎన్నో తక్కువ మార్కులు వచ్చిన వాడు విజయం సాధించాడు. కారణం మన రిజర్వేషన్. విద్య కన్నా కులమే గొప్పదంటుంది మన ప్రజాస్వామ్యం. వారి వారి కులాల వారి మద్దతుకోసం, ఓట్లకోసం మన రాజకీయనాయకులు, మన ప్రభుత్వం మార్చని రాజ్యాంగం వల్లే మనకీ దౌర్భాగ్యం. విలువలేని విద్య ఉన్నా సులువుగా ఉద్యోగం రావాలంటే నేడు రిజర్వేషన్ ఉపయోగపడుతుంది. నాడు నేతలు బడుగు వర్గాలుకూడా ఎదగాలని భావిస్తే పేదవాడికి ఇంకా ఇంకా అడుగుకు తొక్కేసేందుకు ఈనాడు నేతలు ఈ రిజర్వేషన్ వాడుకుంటున్నారు. బలహీనుడు గెలవకుంటే అది యుద్ధధర్మం. కాని కులహీనుడు అన్న పదమే కర్మం. ఒక్కసారి తర్కించి చూస్తే ఈ పక్షపాతం వల్ల అణగారిపోతున్న బతుకులు కనిపిస్తాయి. మేము మా మిడి మిడి జ్ఞానంతో ఎన్నుకున్న నాయకులారా! ఆలోచించండి. ఒక్క క్షణమైనా ప్రజాసంక్షేమాన్ని తలిస్తే ఈ రిజర్వేషన్ని మార్చొచ్చు. దీనిని తీసివేయక్కరలేదు మార్చండి చాలు. అపాత్రదానం చేయకూడదంటారు. మరి జ్ఞానం లేని వాడికి, పనికిరానివాడికి సహాయపడే ఈ విధానాన్ని మార్చటానికి మనం ఎందుకు ముందుకు రాలేం. న్యాయమైన సాయం చేయండి. ప్రజలు ఉప్పు తినే నాయకులంతా సమాజానికి ఉపయోగపడేలా ఆలోచిస్తే... విలువైన ఉద్యోగిని, సరైన సమాజాన్ని పొందవచ్చు. ఒక్కసారి భద్రతతో కూడిన వాహనాలనుండి బయటకు వచ్చి నమ్మిన ప్రజల గూర్చి ఆలోచించే నాయకులొస్తారని, సమాజ ధర్మాన్ని, రాజ్యాంగాన్ని సరిచేస్తారని కోరుకుంటూ...

మరింత సమాచారం తెలుసుకోండి: