శ్వాస మొదలైన క్షణం నుండి శ్వాస ఆగే వరకు జీవితం ఒక పోరాటం అయితే ఈ ఓటమి ఇంకెన్నాళ్ళు నీ పై ప్రేమ మొదలైన నాటి నుండి ఈనాటి వరకు సాగింది ఒక ఆరాటం అయితే ఈ నరకం ఎన్నినాళ్ళు నీతో పరిచయం అయిన నాటి నుండి నా శోకం మరణించింది కాని ఈ రోజు నీకు దూరం అయిన క్షణం నుండి నా నవ్వు చచ్చిపోయింది నా సర్వం నీవు అవుతావనుకున్నాను కాని నీ పర్వం ఈనాడు ముగిసిపోయింది నా జీవితాంతం నీవు తోడుంటావనుకున్నాను కాని నీతో నా పయనం ఆదిలోనే ఆగిపోయింది అందుకే ఇక పై..... నీవు లేని నన్ను నేను ప్రేమించాలి నీతో గడిపిన క్షణాలని మరవటానికి ప్రయత్నించాలి కాని...... నిన్ను నాకు దూరం చేసిన నన్ను నేను ద్వేషిస్తున్నాను అయినా గాని నన్ను నాకు దగ్గర చేసిన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను

మరింత సమాచారం తెలుసుకోండి: