నా నయనంలో నీ రూపం తొలిసారి నిండినపుడు నేనెరుగను అది ప్రేమ అని నా హృదయంలో నీ ప్రతిరూపం తొలిసారి కొలువైనపుడు అనుకున్నాను అది భ్రమ అని నా జీవితంలో నా అడుగు తొలిసారి నీ అడుగులతో కలిసినపుడు అనుకున్నాను అది ఆ దేవుని వరమని నా ప్రయాణంలో ప్రేమదేవత ఆవిర్భవించింది అంటే ఊహించాను అది నీ తరమని కాని...ఈనాడు నేను కేవలం నీ చేతుల్లొనే ఓడిపొయాను నీ జాడ కనపడక ఒక్కడినే మిగిలిపోయాను నా శ్వాసల్లో నీ ఊపిరి నిండి ఉంటుందని ఆనాడు కలలు కన్నాను నీవు నా అంతిమ ఊపిరికి సాక్ష్యం అని ఈనాడు తెలుసుకున్నాను నా గుండెలోతుల్లో ముద్రించుకున్న జ్ఞాపకాలను ఈనాడు చెరిపివేస్తాను అందుకే....ఈనాడు దారి తెలియని ప్రపంచంలో ఉండిపోయాను నీ తోడు నాతోలేక ఒంటరిగా మిగిలిపోయాను నా ఆఖరిమాట.... ఏనాటికైనా నన్ను ప్రేమిస్తావని ఆశిస్తాను

మరింత సమాచారం తెలుసుకోండి: