నీ జ్ఞాపకాలతో మధురం ప్రతిక్షణం నీ గొంతుతో కోకిల ఎప్పుడూ సాగించును రణం నీ కోసమే వేచెను ఏనాటికి ఈ నా ప్రాణం నీ తోడు లేనిదే సార్ధకతలేనిది ఈ నా జీవనప్రయాణం కాలగమనమున కలిసిపోయిన ప్రతిక్షణమూ నీ తలపే జీవితగమనమున గడిచిపోయే ప్రతి అడుగు నీ వైపే నాకు తెలిసి నా ప్రతిరూపము కూడా నీ రూపే నను గమనించే ప్రతి వెలుగు నాకు నీ చూపే నా ఈ భావనలో నిజం తెలియని ప్రతిక్షణం స్వర్గం నా ఈ మధురస్మృతులు కలైతే సరితూగదు నరకం ఇది నిజమైతే కలలను దాటి పరిగెడుతుంది నా మౌనం ఆ పరుగులలో నీ రూపుకై వెతుకుతుంది నా నయనం నిను చూడలేని క్షణం చలించదు నా మనసు నీవు లేని ఈ లోకం నాకు కంటినలుసు మదిలో ఏనాటికి నీ రూపమే కొలువయ్యేది అని నాకు తెలుసు నిను చేరుకోవటం కొరకే నా ఈ పయనం అని నాకు తెలుసు

మరింత సమాచారం తెలుసుకోండి: