పవన్ కల్యాణ్ అధ్యక్షతన ప్రారంభం కానున్న ‘జనసేన’ పార్టీకి ఉమ్మడి ఎన్నికల చిహ్నం లభించే అవకాశాలు లేవు. రాజకీయ పార్టీని ప్రారంభించే విషయమై ఆయన ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత ఎన్నికల సంఘానికి దరఖాస్తు దాఖలు చేశారు. ఒక రాజకీయ పార్టీకి గుర్తింపు, ఉమ్మడి చిహ్నం లభించటానికి దరఖాస్తు అందిన తరువాత నాలుగు నెలలు పడుతుందని ఎన్నికల సంఘం అధికారులు తెలియజేశారు. పవన్ కల్యాణ్ దరఖాస్తు రెండురోజుల క్రితమే అందినందున ఎన్నికల సంఘం ఏమీ చేయలేదని ఎన్నికల కమిషనర్ హెచ్‌ఎస్ బ్రహ్మ తెలియచేశారు. ‘జనసేన’ అన్న పేరు పెట్టుకున్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్ధులు స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీ చేయవలసి ఉంటుందని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: