* కేంద్ర నిర్ణయం ముందుగా నాకు చెప్పలేదు, విభజనకు నేనే కారణం అంటుంటే చిరంజీవి రాజకీయ పరిజ్ఞానంపై నాకు అనుమానాలు వస్తున్నాయి. విభజన తీరుపై కేంద్రం అవలంభించి తీరు అవమానకరం. తెలుగు జాతి భవిష్యత్ కోసమే పార్టీ పెట్టాను : కిరణ్ కుమార్ * గవర్నర్ తో సీఎస్ మహాంతి భేటి * ఢిల్లీ : కాంగ్రెస్ వార్ రూమ్ లో రాష్ట్ర స్ర్కీనింగ్ కమిటీ భేటి. హాజరైన దిగ్విజయ్, వయలార్ రవి, పొన్నాల,ఉత్తమ్,దామోదర,వంశి. పొత్తుల అంశం, లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై చర్చ * పీజీ మెడికల్ స్కాంపై సాయంత్రం 4 వరకు ఫిర్యాదుల స్వీకరణ. 5 గంటలకు నివేదిక ఇవ్వనున్న విచారణాధికారి వేణుగోపాలరెడ్డి * కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కించేందుకు 13 జిల్లాల్లో పర్యటిస్తా, పాతనీరు పోయి కొత్త నీరు వస్తుంది. అప్పడే కాంగ్రెస్ మరింత పుంజుకుంటుంది. కార్యకర్తలు, అభిమానులే నాకు కొండంత అండ : చిరంజీవి * కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి నోటిఫికేషన్ రాగానే గోడలు దూకి వెళ్లిపోయారు. పోలవరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తాం. ముంపు గ్రామాల విలీనం ఆర్డినెన్స్ రావాల్సి వుంది, పోలవరం ముంపు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లోనే వుంటాయి : రఘువీరా * నల్లగొండ : యాదగిరిగుట్ట (మ) వంగపల్లి శివారలో విషాదం. రైలు కింద పడి ఇద్దరు కూతుళ్ల తో సహా తల్లి ఆత్మహత్య * కరీంనగర్ : రామగుండం సమీపంలో కుప్ప కూలిన రైల్వే బ్రిడ్జి. తెగిపడిన విద్యుత్ తీగలు, ఢిల్లీ – చెన్నై మద్య రైళ్ల రాకపోకలు అంతరాయం * ఢిల్లీ బయలు దేరిన జానారెడ్డి. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న రాజనర్సింహ

మరింత సమాచారం తెలుసుకోండి: