అరుదైన జీవితంలో….. అనుక్షణం మలుపులు భరించలేని కొసమెరుపులు నన్ను చూసి ఎన్నో పెదవి విరుపులు నన్ను నిలవనివ్వని ఎన్నో తలపులు ఇదే నా జీవితం ఇదే నా మధుర ప్రయాణం సుదీర్ఘ జీవనయానం అర్ధం కాని సంధిగ్ధ స్థితిలో ముగిస్తున్నా ఈ నా మనోవేదన కాని ఎన్నటికి ఆగదు నా జీవితంలో అరక్షణం ఆనందానికైనా నా నీరిక్షణ నిజానికి.... నా ప్రేమ ఒక స్వార్ధం నా నవ్వు ఒక స్వార్ధం నా ఆత్మ ఒక స్వార్ధం నా జీవితం ఒక స్వార్ధం ఇచట నేనొక వ్యర్ధం ఎవ్వరికి ఇష్టంలేని, నచ్చని, అక్కర్లేని ఒక పనికిరాని పదార్ధం మరి ఏమిటి నా మనుగడకి అర్ధం నాకు తెలిసి నా బ్రతుకే ఒక అనర్ధం కాని నాతో ఆట దేవుని స్వార్ధం అయింది నా జీవితం ఓటమికి నానార్ధం ఈనాడు నేను నాకే వ్యర్ధం అందుకే నా మరణం నా జీవితంలో ప్రతిక్షణానికి ప్రతిపదార్ధం

మరింత సమాచారం తెలుసుకోండి: