ఒకే చెట్టుకి చేరాయి రెండు గువ్వలు నోరులేకపోయినా ఆనందంగా ఉన్నామంటూ తెలియజేయడానికి మోగిస్తున్నాయి రెండు గువ్వల కాలిమువ్వలు ఏదో చెప్పాలని ఆరాటంతో ఓ గువ్వ ఉంది దానికి లోలోపల ఏదో వేదన కంటికి కనబడుతోంది చెప్పడానికి ప్రయత్నించే దాని తపన రెండో గువ్వ అడిగింది ఏంటో ఆ ఆవేదన అప్పుడు చెప్పింది తన గుండెలో ఆలాపన ఏమనంటే... నీతో ఉండాలని నా ఆశ నీ చుట్టూ తిరుగుతోంది నా శ్వాస నిను ప్రేమించాలనేది నా అభిలాష సిగ్గుపడుతూ పారిపోయింది గువ్వ(రెండోది) మరుసటి రోజు పెద్దల గుండెల్లో నిప్పురవ్వలు గువ్వల గుండెల్లో తారాజువ్వలు వేరు అయిపోయాయి అమ్మా! నాన్నా! అనే ఎన్నో ఏళ్ళ బంధం రెండు గువ్వల ప్రేమను, అనుబంధాన్ని విడదీసింది తాముగా బయటకి రావాలని కలవాలని ఆరాటం కొన్నాళ్ళు అవి సాగించాయి జీవనపోరాటం చివరికి పెద్దలను ఎదిరించి పెళ్ళాడాయి గువ్వల జీవితమే ఇంత పోరాటంతో సాగితే మానవ జీవితం ఎంత పోరాటంతొ సాగాలి ??

మరింత సమాచారం తెలుసుకోండి: