పీజీ మెడిసిన్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రశ్నపత్రం లీక్ కేసు దర్యాప్తులో సీఐడీ నిందితులందిరిని అరెస్ట్ చేసింది. రెండుమూడేళ్ల కిందట కర్ణాటక రాష్ట్రం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి డ్రైవరే ప్రస్తుతం జరిగిన పీజీఎంఈటీ-2014 ప్రశ్నపత్రం లీకేజీలో సూత్రధారిగా వ్యవహరించాడు. అప్పట్లో ఆ సూత్రధారికి డ్రైవర్‌గా వ్యవహరించడంతో ప్రశ్నపత్రం ఎక్కడ నుంచి, ఎలా లీక్ చేయవచ్చనే అంశాలపై మంచి అవగాహన ఏర్పడ్డంతో ఈ పనికి పూనుకున్నాడని విచారణలో తేలింది. ఎన్‌టీఆర్ యూనివర్శిటీ పీజీఎంఈటీ-2014 ప్రశ్నపత్రాల ముద్రణ బాధ్యతల్ని కర్ణాటకలోని మణిపాల్‌లో ఉన్న ప్రభుత్వ ముద్రణాలయానికి అప్పగించింది. పీజీఎంఈటీ ప్రశ్నపత్రాలు సైతం ఇక్కడే ముద్రితమౌతాయని తెలుసుకున్న సదర డ్రైవర్ అనూప్ లీకేజ్ కోసం పక్కా ప్లానే వేశాడు. అక్కడి ఉద్యోగం కోసం మార్గాలు అన్వేషించినా డ్రైవర్... ప్రెస్‌కు క్లీనింగ్, స్వీపింగ్ వంటి పనుల్లో జాయిన్ అయిపోయాడు. ప్రింటింగ్ ప్రెస్ లో క్లీనింగ్, స్వీపింగ్ నిర్వహించేందుకు మణిపాల్‌కే చెందిన షాలిమార్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీతో ఒప్పందాన్ని ఆసరా చేసుకున్నాడు. ఇందులో పని చేసే ఓ వ్యక్తిని ట్రాప్ చేసిన డ్రైవర్ భారీ మొత్తం ఆశచూపి తనకు పీజీఎంఈటీ ప్రశ్నపత్రం కావాలంటూ ఎర వేశాడు. ఇందుకు సదరు ఉద్యోగి అంగీకరించాడని సీఐడీ దర్యాప్తులో తేలింది. సీసీ కెమెరాలు లేని ప్రదేశాన్ని చూసుకుని ఓ ప్రశ్నపత్రాన్ని చేజిక్కించుకున్నాడు. దీన్ని సెక్యూరిటీ తనిఖీల్లోనూ బయటపడకుండా ఉండేందుకు అండర్ వేర్ లో పెట్టుకుని బయటకు తీసుకువచ్చి, డ్రైవర్‌కు ఇచ్చాడంతో వ్యవహారం వ్యాపారాత్మక రూపం సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: