దివంగత ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వై. యస్.రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడు ఎలాంటి కష్టాలు పడుతున్నాడు అని తన పాదయాత్ర లో తెలుసుకున్న వాటిని రూపుమాపడానికి ఎన్నో మంచి సంక్షేమ పథకాలు ప్రవేసపెట్టాడు.అందులో ముఖ్యమైనవి ఆరోగ్యశ్రీ ,ఇందిరమ్మ ఇల్లు,ఫీజు రీయిబుర్స్మెంట్,రైతులకు ఉచిత విద్యుత్,పించన్లు,108,మహిళలకు పావల వడ్డీ రుణాలు ఉన్నాయి.ఒక పేదవాడికి పెద్ద జబ్బు చేస్తే పెద్దాసుపత్రికి పోయి అప్పులపాలు కాకుండా ఆపరేషన్ చేయించుకొని చిరునవ్వుతో తిరిగి వచ్చేదానికి ఆరోగ్యశ్రీ ఎంతో ఉపయోగపడింది .ఒక పేదవాడు కూడా పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొన్నపుడు వాళ్ళ పేదరికం నుండి బయట పడతారు అని ఫీజు రీయిబుర్స్మెంట్ ప్రవేశపెట్టాడు.ఇక రైతులకు కరువుల వల్ల అప్పులపాలు అయిపోయి ఎన్నో కష్టాలు పడుతున్నపుడు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టి నిరంతరాయంగా ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేసాడు.ప్రతి పేదవానికి కూడా సొంత ఇల్లు ఉండాలని ఇందిరమ్మ ఇల్లు పథకం పెట్టి ఐదు సంవత్సరాలలో 50 లక్షల ఇల్లు కట్టించి ఇచ్చాడు.ప్రతి మహిళ కూడా ఆర్తికంగా ఎదగడానికి పావలావడ్డీ రుణాలు ఇచ్చాడు.ముసలి వయసులో కూడ కష్టాలు పడుతున్న అవ్వ,తాతలకు నెల అవ్వగానే పించన్లు ఇచ్చాడు.ఇలా ఎన్నో పథకాలు పేదవాడిని పైకి తీసుకురావడానికి ఎంతో నిబద్దతతో తన ఐదు సంవత్సరాల పదవి కాలంలో ఎంతో తపించాడు రాజశేఖర్ రెడ్డి గారు.ఆయన అకాల మరణం తర్వాత ప్రతి పథకం సరిగా అమలు చేయలేదు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వై. యస్.రాజశేఖర్ రెడ్డి గారు అకాల మరణం తట్టుకోలేక ఎంతో మంది పేదవాళ్ళు చనిపోయినపుడు వాళ్ళు అందరూ కూడా తన కుటుంబంలో వారు,తన ఆత్మీయులు అనుకొని వాళ్ళందరినీ కలుస్తాను అని మాట ఇచ్చాడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు.ఇచ్చిన మాటకోసం ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ ప్రతి పేదవాడి ఇంటికి వెళ్లి నేనున్నాను అని భరోసా ఇచ్చాడు చనిపోయిన కుటుంబాలకు.ఏ రాజకీయనాయకుడు చేయలేని విధంగా నెలలో సుమారుగా ఇరవై ఐదు రోజులు రాత్రి,పగలు తేడా లేకుండా వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాని ఇంటికి వెళ్లి వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు. రాష్ట్రం లో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతుంటే ప్రతిపక్షం వున్నా కూడా వాళ్ళ సమస్యలు మనకేల అని పట్టించుకోనపుడు మీకు అండగా నేనున్నాను అంటూ ప్రతి సమస్య మీద పోరాడుతూ ఎన్నో దీక్షలు,ధర్నాలు చేసాడు వై. యస్.జగన్మోహన్ రెడ్డి గారు.ఇవన్నీ కూడా వై. యస్.జగన్మోహన్ రెడ్డి నిబద్దతను,పేదవాళ్ళ మీద తను ప్రేమను,కష్టపడే విధానం,ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడో తెలియజేస్తాయి.అందువల్ల రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన పథకాలు మల్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు అని ఈ రాష్ట్రం లో ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో మనిషిగా చూసుకుంటూ వై. యస్.రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: