పిల్లి మెడలో గంట కట్టేదెవరు? పిల్లి మెడలో గంట కడితే.. అది వస్తున్నప్పుడెల్లా మోగుతూ ఉంటుందని దాని వలన కాస్త ఎడ్వాంటేజీ ఉంటుందని.. ఎలుకలు ఎప్పటికప్పుడు అలర్ట్‌ అయి, పారిపోతూ ఉండవచ్చునని అన్ని ఎలుకలకూ తెలుసు. మరి పిల్లి మెడలో గంట కట్టేదెవరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అచ్చంగా అలాగే ఉంది. . జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రచారానికి వస్తే పార్టీకి ఎడ్వాంటేజీగా ఉంటుందని.. ఎంతో కొంత ఓటు శాతం మెరుగుపడుతుందని.. పార్టీకి లాభం చేకూరుతుందని పార్టీ శ్రేణులు, నాయకులు అందరికీ తెలుసు. జూనియర్‌ ఎన్టీఆర్‌తో ప్రచారం గురించి కూడా మాట్లాడతాం అంటూ చంద్రబాబు బుధవారం నాడు స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. అంతా బాగానే ఉంది. అయితే.. జూనియర్‌తో మంతనాలు సాగించడానికి పూనిక వహించేది ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌తో తెలుగుదేశానికి పెద్దగా సత్సంబంధాలు లేవు. అన్నీ ఎప్పుడో కట్‌ అయిపోయాయి. పైకి మాత్రం ఎన్టీఆర్‌.. తన రక్తంలో తెలుగుదేశం బ్లడ్‌ మాత్రమే ఉన్నదని ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారే తప్ప.. పార్టీకి అనుకూలంగా వ్యవహరించింది మాత్రం లేదు. గతంలో జూనియర్‌ను బుజ్జగించి తీసుకువచ్చే వెసులుబాటు బాలకృష్ణ వద్ద ఉండేది. ఇటీవలి కాలంలో వారిద్దరికీ చెడినట్లు ఆధారాలు ఉన్నాయి. బాలకృష్ణ కూతురు పెళ్లికి జూనియర్‌ను కనీసం ఆహ్వానించలేదు. ఆయన రాలేదు. ఇప్పుడు బాలకృష్ణ మంతనాలు సాగించే స్థితి లేదు. హరికృష్ణ తన టిక్కెట్‌ సంగతే ఖరారు కాకుండా తన కొడుకు ను రంగంలోకి తేవడానికి ఎంత సహకరిస్తాడో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించడం అనేది.. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు పిల్లిమెడలో గంట కట్టడం వంటి వ్యవహారంగా మారిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: