కనుచూపు మేరలో నాకు కనిపించే నా నీడ కూడా తనవైపు వెళ్ళిపోయింది నన్ను నన్నుగా నిరూపించే నా జీవితం కూడా ఈ క్షణం తనదయిపోయింది ఎందుకో తెలుసా... అనుకరించలేని అద్భుత జీవనయానం తనది నే తలతిప్పలేని, కన్నార్పలేని సుందరవదనం తనది నా జన్మకి సార్ధకత కల్పించేందుకు దేవుడు సృష్టించిన జననం తనది నా జీవితానికి నిజమైన అర్ధం చేకూరేందుకు ఇకపై నా ఈ పయనం తనది అపురూపమైన లావణ్యానికి నిలువెత్తు రూపం నా చెలి ఎన్నడూ చవిచూడని మాధుర్యానికి అసలు రూపం తన మాటల జరి తన కనుసైగలే నా అరచేతిరేఖలుగా మారిన ఈ వేళ తన చెక్కిలిపై నా పెదవుల ముద్రను వేయాలనుంది తన నిశ్వాసలే నా ఊపిరిగా మారిన ఈ వేళ అగ్నిదేవుని సాక్షిగా ఏడడుగులను వేయాలనుంది తన ప్రాణాలే నా సర్వస్వంగా మారిన ఈ వేళ తన అడుగడుగున బాసటగా నిలవాలనుంది తన మాటలే నా కవిత్వంగా మారిన ఈ వేళ తన మాటల్లో భావంగా కలిసిపోవాలనుంది

మరింత సమాచారం తెలుసుకోండి: