ఈ ఎన్నికలు ఇటు తేదేపా అటు వైకాపాలకు చావుబతుకుల సమస్య. ఇది కొత్త సంగతి కాదు. కానీ ఎందుకయినా మంచిదని ముందగానే ఇటు వాళ్లు అటు, అటు వాళ్లు ఇటు కొంత మంది చేరిపోయినట్లు తెలుస్తోంది. వీళ్లు ఆయా పార్టీల అధ్యక్షుల అనుమతితోనే, జంప్ చేసి, అక్కడ ప్రాపకం సంపాదించినట్లు తెలుస్తోంది. అక్కడి విషయాలు ఇక్కడ అందించడం, ఎన్నికల తరువాత అవసరం అయినపుడు ఉపయోగపడడం అన్నది ఈ కోవర్ట్ ల బాధ్యత. ఇదిలా వుంటే భాజపా పోత్తు కుదురుతుందని ముందే ఊహించిన బాబు, రఘురామరాజు లాంటి కొందరిని ఎంపిక చేసి, అక్కడ పోటీ చేసేందుకు సన్నద్ధం చేసారు. వారికి సరిపోయే స్థానాలనే పొత్తులో విడిచిపెట్టారు. కానీ తీరా చేసి, భాజపా టికెట్ ల కేటాయింపులో స్వంత నిర్ణయం తీసుకోవడంతోనే బాబు పొత్తును తెగ్గొట్టడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. నరసరావు పేట పేరు మార్పిడి అందులో భాగమే అని వినికిడి. కానీ రఘురామ రాజు వ్యవహారంలో ఒక ఉన్నతాధికారి వత్తిడి కారణంగా టికెట్ లభించలేదని, అందువల్లే బాబు వెనక్కు తగ్గారని తెలుస్తోంది. రఘురామరాజు, పివిపి లకు టికెట్ లు ఇస్తే, జగన్ అవినీతిని ఎండగట్టే అవకాశం వుండదని బాబు సలహాదారులు చెప్పడంతో, మిన్నకుండక తప్పలేదు.​

మరింత సమాచారం తెలుసుకోండి: