పాపం భాజపా పరిస్థితి చూస్తే జాలేస్తోంది. కష్టపడి సినిమా నటుల మద్దతు సంపాదించినా, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా, అధికారసాధన సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. జనం టీఆర్ఎస్ వైపో, కాంగ్రెస్ వైపో చూస్తున్నారని పసిగట్టిన భాజపా నేత మోడీ భాజపాకు ఓటేసి గెలిపించమని కాకుండా, కేంద్రంలో, రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం వుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. మరి అలా అనుకున్నపుడు సీమాంధ్రలో కూడా అన్ని స్థానాలకు పోటీ చేసి, అదే తరహా పిలుపు ఇవ్వవచ్చు కదా. గట్టిగా పది స్థానాలకు పోటీ పడడం లేదు. అందులో సగమన్నా గెలుస్తారా అంటే అనుమానమే. ఇంత దిగజారుడు పరిస్థితిలో మోడీ వచ్చి ఆంధ్రలో ప్రచారం చేస్తారా? చేస్తే ఏమని పిలుపుఇస్తారు? మోడీ అయినా, పవన్ అయినా తేలుగుదేశాన్ని గెలిపించమని పిలుపు నివ్వాల్సిందే. ఇదిలా వుంటే, తెలంగాణ అంటే తనకు ప్రేమని, ఇవ్వడం మంచిదని అక్కడ మాట్లాడుతున్న పవన్ ఇక్కడకు వచ్చి ఏం చెబుతారు. సమన్యాయం చేయలేదనా? మోడీ ఏమో, బిడ్డను బతికించి తల్లిని చంపేసారు అంటున్నారు. మరి అలా చేస్తుంటే, వారెందుకు మద్దతిచ్చి మరీ మర్డర్ చేయించింది? దానా దీనా తేలుతున్నదేమిటంటే, ఏదో మాట్లాడాలని మాట్లాడడం కానీ, నిజంగా సీమాంద్రపై ఆ ఇద్దరికి ప్రేమ లేదని.

మరింత సమాచారం తెలుసుకోండి: