కేవిపి వ్యవహారం వైకాపాకు చుట్టుకుంటుందా?, ఎన్నికలను ఎదుర్కుంటున్న వేళ విజయానాకి బ్రేకేస్తుందా అన్న అనమానాలు వ్యక్తం అవుతున్నాయి.. కారణం కేవిపి రాంచంద్రరావు అంటే అందరికి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ లో ఉన్నా, మరే పార్టీలో ఉన్నా కూడా ఆయన వైఎస్ ఆత్మ అని, వారి నడుమ విడదీయరాని బందం ఉన్నదన్నది అందరికీ తెలిసిందే. టైటానికి కుంభకోణంలో నిందితునిగా దేశానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కేవిపిని ప్రకటించినా మరోలా ఉండేది. దేశ రాజకీయాలతో సంబందంలేని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బిఐ కేవిపిని దోషిగా ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థగా పేరున్న ఎఫ్ బిఐ ఈ విషయాన్ని తేల్చాక ఇది ఎన్నికల వేళ గిట్టని వారు ఇరికించారని కొట్టిపారేసే అవకాశం కూడా జగన్ కు , కేవపికి లేకుండా పోయింది. టైటానిక్ వ్యవహారం పూర్తిగా వైఎస్ హయాంలో జరిగింది. దీనిలో కేవిపినే కీలకంగా వ్యవహరించాడని ఎఫ్ బిఐ తేల్చి చెప్పింది. ఈ కుంభకోణంలో 111కోట్లు ముడుపులు ముట్టాయని కూడా తేల్చింది. వైఎస్ కు తెలియకుండా అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి అక్రమ వ్యవహారాన్ని కేవిపి సొంతంగా చేయలేడు. వైఎస్ ప్రోద్బలంతోనే కేవిపి చేసారని, దీనిలో చేతులు మారిన కోట్లాది రూపాయల్లో వైఎస్ కు వాటా ఉందనే అంటారు. అంటే ఇది ఎవరిపై ప్రభావం చూపుతుంది. నేరుగా జగన్ పైనే చూపుతుంది. వైఎస్ పదవిని అడ్డం పెట్టుకుని జగన్ లక్షకోట్లు అక్రమంగా సంపాందించారన్న అభియోగాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ కేసుల్లో ఇప్పటికే జగన్ జైలుకు వెల్లి బెయిల్ పై వచ్చారు. కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు ఆయనపై, వైఎస్ హయాంలో జరిగిన అవినీతిపై దుమ్మెత్తి పోస్తున్నాయి కూడా. ఈ తరుణంలో కేవిపిని అరెస్టు చేసేందుకు రంగం సిద్దమయిందంటే దాని ఎఫెక్ట్ తప్పని సరిగా జగన్ పై పడుతుంది. నిజంగా కెవిపి తప్పు చేయకుంటే అరెస్టును తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తారు. అంటే ఈ కుంభకోణం నిజమే, అందులో కేవిపి పాత్ర నిజమే. అంటే ఆ ముడుపుల్లో వైఎస్ కు వాటా కూడా అందిందన్నది నిజమే అంటారు. ఈ వ్యవహారంతో జగన్ బాబాయ్ కు సంబంధం వుందన్న ఆరోపణలు కూడా వున్నాయి. ఎన్నికల తరుణంలో వైఎస్ కుటుంబంపై ఇలాంటి పెద్ద మచ్చ మీద పడితే దాని ప్రభావం వైకాపా విజయావకాశాలపై పడుతుందన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: