చంద్రబాబు, పవన్ ఎడమొహం పెడమొహం గా ఉన్నారు. కనీసం వేదిక మీద కూడా పక్కన కూర్చోవడానికి ఇష్టపడలేదు. మోడితో పాల్గొన్న సభల్లో టిడిపి ఊసే ఎత్తలేదు. కాని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను కలిసిన వెంటనే సీన్ మారింది. బయటకు వచ్చి తాను ఎన్డీఏకు మద్దతిస్తున్నాను అన్నారు. ఎన్డీఏ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తాను అన్నారు. అంతే కాదు 24గంటల గడవక ముందే తెలంగాణలో సుడిగాలి ప్రచారానికి సిద్దమయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం అంకం ముగింపు వరకు పవన్ రోడ్ షోలు, సభలతో తన పవనిజం చూపించనున్నారు. ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చింది. చంద్రబాబు ఏమి చెప్పి పవన్ ను ఒప్పించారు అన్న టాక్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే పవన్ చంద్రబాబులు కలుసుకున్నాక లోపాయి కారి ఒప్పందం ఏదో కుదిరిందని మాత్రం అందరు భావించారు. ఇప్పుడు అదేంటి అన్నదే అసలు సిసలైన ప్రశ్న. పలువురు పలురకాలుగా అనుకుంటున్నప్పటికి అసలు కారణమిదే అంటూ తెలుగుతమ్ముళ్లు లోపాయికారీగా చెప్పుకుంటున్న కారణం ఒకటి వుంది. తెలంగాణపై పట్టు సాధించడం కోసం అన్నదే ఆ కారణం. ఎలాగు రాష్ట్రం విడిపోయింది. కలిపి ఉంచడమనేది ఇక సాధ్యం కానిది. కాని తెలంగాణపై సీమాంధ్రులు తమ అధికారం దక్కించుకోవాలంటే ఏం చేయాలి. అక్కడ ప్రభుత్వంలో కీలకం కావాలి. లేదు ఏకంగా అధికారాన్నే దక్కించుకోవాలి. ఇది నెరవేరాలంటే ఏం చేయాలి. తెలంగాణ రావడానికి కారణమైన బిజేపి బలం పెరగాలి. తెలంగాణలో బలమైన క్యాడర్ ఉన్న టిడిపిని ఉపయోగించుకోవాలి. టిడిపి అభ్యర్తుల విజయావకాశాలు అక్కడ ఎక్కువ. పవన్ బలం తోడైతే ఇంకా ఈజీ అవుతుంది. అప్పుడు తెలంగాణలో కూడా సీమాంధ్రుల పార్టీ కీలకం అవుతుంది. మనం అనుకున్నది చేసుకోగలుగుతాం, మన కంట్రోల్ లో తెలంగాణను ఉంచగలుగుతాం అని పవన్ కు బాగా మైండ్ వాష్ చేసారట చంద్రబాబు. అంతే కాదు అందరికి ప్రధానమైనది హైదరాబాద్, తనకైనా, పవన్ కైనా ఉన్నదంతా హైదరాబాద్ లోనే. హైదరాబాద్ లో టిఆర్ఎస్ పాగా వేస్తే అందరికి డేంజరే. అందుకే హైదరాబాద్ ను సీమాంధ్రుల గుప్పిట్లో ఉంచుకోవాలి. ఇక్కడ ఎలాగు పవనిజం బాగా ఉంది. సీమాంద్రవారే ఎక్కువ ఉన్నారు. ఇలా చెప్పడంతో పవన్ కన్విన్స్ అయ్యారు అన్న వాదన వినిపిస్తోంది. పవన్ ప్రచారం పర్వం కూడా ఎక్కువగా హైదరాబాద్ లోని స్థానాల్లోనే ఉంది. వీటితో పాటు హైదరాబాద్ ను ఆనుకుని ఉన్న నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఈ జిల్లాల్లో కూడా హైదరాబాద్ లో దాదాపు కలసిపోయి ఉన్న షాద్ నగర్, భువనగిరి వంటివి ఉన్నాయి. అనుమానం రాకుండా తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ ఉన్న ఉత్తర తెలంగాణ లోని ఒకటి రెండు స్థానాల్లో పవన్ ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు తన చాణక్యాన్ని ప్రదర్శించి పవన్ ను దారిలోకి మాత్రం తెచ్చుకున్నారన్నమాట

మరింత సమాచారం తెలుసుకోండి: