తెలుగుదేశం పార్టీ తరపున ముమ్మరంగా ప్రచారం సాగించడానికి రాష్ట్రానికి చెందిన సుమారు పది నుంచి పదిహేను లక్షల మంది జనం రోజుకు అయిదు రూపాయిల వంతున చెల్లిస్తున్నారు. అలాగే వైకాపా తరపున ప్రచారం సాగించడానికి దాదాపు అంతమంది జనం, వారూ అయిదు రూపాయిల వంతున చెల్లిస్తున్నారు. అంటే రోజుకు కోటి రూపాయిల ప్రచార వ్యయం జనం భరిస్తున్నారు. ఇది దాదాపు నెల రోజుల పాటు సాగుతోంది. అంటే ముఫై కోట్ల రూపాయిలు. ఎందుకిలా? ఎందుకు భరించాలి? ఏమిటిదంతా అనుకోవద్దు..అయోమయం వద్దు. ఈనాడు, సాక్షి దిపత్రికలు రెండు పార్టీల కరపత్రాలుగా మారిపోయిన సంగతి తెలిసిందే. వీటి ఖరీదు రోజుకు అయిదేసి రూపాయిలు. జనం కొంటున్నారు. కానీ వాళ్లు చేస్తున్నది వారి వారి పార్టీల ప్రచారం. మరి జనం ఎందుకు కొనాలి? ఈ నెల రోజులు కొనడం ఆపేస్తే, వచ్చిన నష్టమేముంది? సాక్షి వైకాపా పత్రిక అని తెలిసిందే. అందుకోసమే పెట్టారు. మరి ఈనాడుకు ఏ మొచ్చే. తెలుగుప్రజల గుండె చప్పుడు అని చెప్పుకుంటూ, అందుకు బదులుగా తెలుగుదేశం బాకా చప్పుడు వినిపించడం ఏమిటో? సాక్షి వైకాపా ప్రచారం చేసుకుంటూ, మిగిలిన పార్టీల వార్తలు కూడా ఇస్తోంది కనీసంలోకనీసం. కానీ ఈనాడు ఈ ధర్మం కూడా గాలికి వదిలేసింది. టాప్ స్టొరీ నుంచి, ఆఖరు పేజీ ఆఖరి వాక్యం వరకు జగన్ వ్యతిరకే వార్తలతో నింపేస్తోంది. ఎంచి ఎంచి అవే వార్తలు ప్రచురిస్తోంది. ఇందుకోసం దిగజారిపోతున్నా పట్టించుకోవడం లేదు. షర్మిల టూర్ లో మద్యం అని వార్త రాసి, అందులో విజయనగరం జిల్లాలో పట్టుకున్న మద్యం బోమ్మ వేస్తున్నారు. దానికీ దీనికీ ఏమిటి సంబంధం, ఇది జనాన్ని తప్పుదోవ పట్టించడం కాదా అన్నది కూడా పట్టించుకోవడం లేదు. వారానికి ఒకసారైన జగన్ పై ఎడిటోరియల్ ప్రచురిస్తున్నారు. అందులో నేరుగా కరకు పదజాలం, దూషణలు యధేచ్ఛగా వాడేస్తున్నారు. దీనికి ప్రతిగా సాక్షి కూడా వాటికి ఖండనలు వేస్తోంది. ఇలా పరస్పర దూషణలు చదవుకోవడానిక ఈ నెల రోజుల పాటు ముఫై కోట్లు ఖర్చు చేయడం పాఠకులకు అవసరమా? ఆలోచించండి

మరింత సమాచారం తెలుసుకోండి: