జీవితంలో ప్రతి ఆట మనం గెలుస్తూనే ఉంటే....ఓటమికి అర్ధం తెలీదు. విజయానికి అర్ధం ఉండదు. అలా అని ఓడిపోతూ ఉంటే మన జీవితానికి విలువ ఉండదు. ప్రయాణంలో ఒడిదుడుకులు సహజం. అలాగే జీవితానికి సుఖదుఃఖాలు సహజం. కాని వాటిని ఎదుర్కొని పోరాడటమే జీవననైజం. నిజంగా ప్రేమ చాలా గొప్పది. అది మన గెలుపుకు మహాశక్తి. ఎప్పుడూ దానివల్ల మనం ఓడిపొకూడదు.మనం ఖచ్చితంగా ఎవరో ఒకరిని ప్రేమిస్తాం. వారిని దూరంగా ఉంచినంత మాత్రాన వారిపై ప్రేమ పెరుగుతుందే తప్ప తరగదు. ఎన్నడూ తగ్గదు. విజయానికి నాంది గెలుపుపై నీకున్న ప్రేమ వర్షానికి నాంది భూమిపై గగనానికున్న ప్రేమ ఉదయానికి నాంది గగనానిపై సూర్యునికున్న ప్రేమ జాబిలికి నాంది రాత్రిపై చంద్రునికున్న ప్రేమ మన పయనానికి నాంది ప్రాణంపై మనకున్న ప్రేమ మన బంధానికి నాంది నీ స్నేహంపై నాకున్న ప్రేమ ఆవేశం నీ జీవితాన్ని శాసించినరోజున మన ఆలోచన జ్ఞానాన్ని కోల్పోతుంది. నీ గమ్యం నిను నిర్దేశించిన తరుణాన విజయం నీ వెన్నంటి పరుగులు తీస్తుంది. విషమెరుగని దేవతలకు అమృతం రుచి తెలీదు. నిరాశ పొందని జీవికి ఆశించే దైర్యం, హక్కు లేవు. అప్యాయతలు తెలియని నాకు ప్రేమించే హక్కు లేదు.అందుకే ప్రేమించే గుణమున్న మీలాంటి వారంతా ప్రేమని గెలిపించాలి. నీ ప్రేమకి నీవే సమిధవి నీ ప్రేమకి నీవే కర్తవి నీ ప్రేమకి నీవే కర్మవి నీ ప్రేమకి నీవే క్రియవి నీ ప్రేమకి నీవే ప్రేమవి నీవు ప్రేమించే సైతం నీ ప్రేమకోసం తపించేలా ప్రేమించు. అప్పుడు ఆ వ్యక్తి నీ సొంతం. వారి ప్రేమ నీ విజయం. అంతేగాని దక్కరేమోనన్న భయంతో నీ జీవితాన్ని పాడుచేసుకోవద్దు. నీ మనసుని మలినం చేసుకోవద్దు. వారికి ఎన్నడూ దూరం కావద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: