పేదరికం లేకుండా చేస్తాం.. అభివృద్ధికి బాటలేస్తాం.. పందిని నంది చేస్తాం.. నందిని పంది చేస్తాం.. కులాల కుట్రలు నేర్పిస్తాం.. మతాల మత్తుమందు చల్లేస్తాం.. పార్టీలు మర్చేస్తాం.. కుర్చీలు ఎక్కేస్తాం.. సాగునీరు తెప్పిస్తాం.. తాగు నీరు అందిస్తాం.. అంటూ.. చివరకు కన్నీళ్లే మిగిలిస్తున్నారు మన నేతలు. కానీ మన తలరాతలు మారడంలేదు.. హామీల మాట అటుంచితే.... వారి ఆస్తుల్ని మాత్రం వందలు, వేల శాతాల్లో పెంచుకుంటున్నారు. డబ్బే పరమావదిగా.. ఆస్తులే లక్ష్యంగా వారి పాలన సాగుతోంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. నేతలు ప్రజల్ని అభివృద్ధి చేస్తామని ఊక దంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. వాళ్లు మాత్రం మూడు కుంభకోణాలు.. వేల కోట్ల రూపాయల ఆస్తులుగా సాగుతోంది పయనం. అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ ఆస్తులు సంపాదించుకోవాలంటే దానికి వెరీ షాట్ కట్ మెథడ్... పాలిటిక్స్. ఇది నిజమని నిరూపిస్తున్నారు మన నేతలు. గత ఐదు ఏళ్లకు.. ఇప్పటికి వారి ఆస్తులు పోల్చి చూస్తే.. ఆశ్చర్యం కలగక మానదు. ఇది ప్రజాస్వామ్యమా...? ధన స్వామ్యమా అనే అనుమానం కలుగుక మానదు. లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు అభ్యర్ధులు తమ ఆస్తుల జాబితా వెల్లడించాల్సిన అనివార్య పరిస్థితుల్లో.. కేంద్రంలో అధికారం వెలగబెట్టిన మంత్రులు.. తమ ఆస్తుల్ని వెల్లడించారు. ఈ ఆస్తులను చూస్తే కళ్లుతిరగక తప్పదు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ ఆస్తులు గత ఐదేళ్లలో.. 1,471 శాతం మేరకు పెరిగాయి. ఎన్‌సిపి నాయకుడు ప్రఫుల్‌పటేల్‌ ఆస్తులు ఈ ఐదేళ్లలో 156 శాతం పెరిగాయి. కపిల్‌సిబల్‌.. ఢిల్లీ లోక్‌సభ ఏడు స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులందరికన్నా ధనవంతుడు ఈయనే. ఐదేళ్ల క్రితం 30 కోట్ల రేంజ్‌లో ఉన్న సిబల్‌... ఐదేళ్లలలో బాగా కష్టపడి 114 కోట్ల రూపాయలకు చేరారు. అదే విధంగా కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఆస్తులు 270 శాతం పెరిగాయి. ఇక విదేశాంగ శాఖ నిర్వహించిన సల్మాన్‌ ఖుర్షిద్‌ ఆస్తులు 401 శాతం, కేంద్ర మంత్రులుగా పని చేసిన శశిధరూర్‌ ఆస్తులు... 109 శాతం, కృష్ణతీర్ధ ఆస్తులు 231 శాతం, హెచ్‌కె మునియప్ప ఆస్తులు 335 శాతం పెరిగాయి. గతంలో పెరిగిన ఆస్తులు వెల్లడించేందుకు చాలా మంది రాజకీయ నాయకులు ఇబ్బంది పడేవారు. మరి... కాలం మారిందో ప్రజల దృష్టిలో అవినీతిపరులపై అభిప్రాయం మారిందో తెలియదు కానీ ఇప్పుడు ఆస్తులను వెల్లడించేందుకు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ అభ్యర్ధులు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఎంత ఎక్కువ డబ్బు ఉంటే... అంత మంచి అభ్యర్ధి అని పార్టీలు కూడా లెక్కిస్తుండటం కూడా ఈ మార్పునకు కారణం కావచ్చు.. ప్రజలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమించినట్లు. అంటే వ్యక్తుల అభివృద్ధే దేశం అభివృద్ధి అన్న మాట. ఈ మాట మన కన్నా ముందు యుపిఏ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు అర్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న యుపిఏ ప్రముఖులు.. ఈ దిశగానే పనిచేసి సొంత ఆస్తులు బాగానే కూడబెట్టుకున్నారు. గత ఐదేళ్లలోనే యుపిఏ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు సగటున 280 శాతం మేరకు సొంత ఆస్తులు పెంచుకున్నట్లు లెక్కల్లో తేలింది. కమల్‌నాథన్‌.. ఈ లెక్క ఎవరో వేరే వారు వేసింది కాదు. వారు స్వయంగా ఎంచుకున్న లెక్కలు. లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు అభ్యర్ధులు తమ ఆస్తుల జాబితా వెల్లడించాల్సిన అనివార్యమైన పరిస్థితుల్లో కేంద్రంలో అధికారం వెలగబెట్టిన మంత్రులు తమ ఆస్తుల్ని వెల్లడించారు. ఈ ఆస్తులను చూస్తే కళ్లుతిరగక తప్పదు. ఐదేళ్ల కిందట కమల్‌నాథన్‌ ఆస్తులు 25 కోట్ల రూపాయల లోపునే ఉండేవి. కాగా ఈ ఐదేళ్లలో లంకెబిందెలు దొరికినట్లు... అమాంతం పెరిగిపోయాయి. ఆయన ఆస్తులు 2014 నాటికి దాదాపుగా 187 కోట్ల రూపాయలకు పెరిగిపోయాయి. మధ్య ప్రదేశ్‌లోని ఛింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆయన... ఈ మేరకు ఆస్తుల వివరాలు ప్రకటించారు. 1980లో ఆయన తొలి సారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనపుడు ఆయన ఆస్తులు.. 7కోట్ల 6లక్షల రూపాయలు మాత్రమే. కమల్‌నాథ్‌.. ప్రఫుల్‌పటేల్‌.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పలు బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించిన కమల్‌నాథ్‌ ఆస్తులు కూడా... సమర్ధంగానే సంపాదించినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన ఎన్‌సిపి నాయకుడు ప్రఫుల్‌పటేల్‌ ఆస్తులు.... ఈ ఐదేళ్లలో 156 శాతం పెరిగాయి. మహారాష్టల్రోని భాంద్ర-గోండియా పార్లమెంటు స్థానం నుంచి నామినేషన్‌ వేసిన ఆయన తన ఆస్తుల్ని వెల్లడించారు. పారిశ్రామికవేత్త అయిన ఆయన 2009లో 125.4 కోట్ల రూపాయల ఆస్తులు ప్రకటించగా.... ప్రస్తుతం అవి 217.9 కోట్లకు చేరుకున్నాయి. మహా రాష్టల్రోనే అత్యంత ధనవం తుడైన అభ్యర్ధిగా ప్రఫుల్‌పటేల్‌ ఉన్నారు. కపిల్‌సిబల్‌.. షిండే.. యుపిఏ-2లో కీలక శాఖలు నిర్వహించిన మరో మంత్రి కపిల్‌సిబల్‌. ఆయన ఆస్తులు గత ఐదేళ్లలో 358 శాతం పెరిగాయి. కపిల్‌సిబల్‌ ఢిల్లీ లోక్‌సభ ఏడు స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులందరికన్నా ధనవంతుడు. ఐదేళ్ల కిందట 30 కోట్ల రేంజ్‌లో ఉన్న సిబల్‌ ఐదేళ్లలలో బాగా కష్టపడి 114 కోట్ల రూపాయలకు చేరారు. అదే విధంగా కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఆస్తులు 270 శాతం పెరిగాయి. విదేశాంగ శాఖ నిర్వహించిన సల్మాన్‌ ఖుర్షిద్‌ ఆస్తులు 401 శాతం, కేంద్ర మంత్రులుగా పని చేసిన శశిధరూర్‌ ఆస్తులు 109 శాతం, కృష్ణతీర్ధ ఆస్తులు 231, హెచ్‌కె మునియప్ప ఆస్తులు 335 శాతం పెరిగాయి. వీరు.. వీరితోపాటు మరి కొందరు అక్రమంగా ఈ డబ్బు సంపాదించారని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. వీరి ఆస్తులు పెరిగిన నిష్పత్తిలోనే దేశం కూడా అభివృద్ధి చెంది ఉంటే మరింత బాగుండేదని చెప్పడమే ఉద్దేశ్యం. దేశ వృద్ధిరేటు పడిపోతూ.... ద్రవ్యోల్బణం పెరిగిపోతూ.... సామాన్యుడు చితికిపోతూ ఉంటే... వీరి ఆస్తులు పెరగడంపై అనుమానం రాకమానదు. దేశంలో పారిశ్రామిక ప్రగతి కుంటుబడిపోతున్న సమయంలో కొందరి పరిశ్రమలు పెరగడం ఏమిటి...? ద్రవ్యోల్బణం పెరిగిపోతూ నిత్యా వసర వస్తువులు కొనుగోలు చేయడమే కష్టంగా మారిపోతున్న సమయంలో వీరి ఆస్తులు వందల రెట్లు పెరగడం ఎలా...? సామాన్యుడు చితి కిపోతున్నాడని అనుకున్నప్పుడల్లా ప్రపంచం మొత్తం ఆర్ధిక మాంద్యంలోనే ఉందని సర్దిచెప్పే ఈ అమాత్యులు.. ఇంతలా ఎలా సంపాదించారు..? ఇప్పటికీ 10 నుంచి 12 కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్న డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఈ మంత్రులకు ప్రధానిగా ఉన్నారు. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ ఆస్తులు పెరగలేదు. వాటి మార్కెట్‌ విలువ పెరుగుతుండటం వల్ల ఆయన ఆస్తులు కూడా పెరిగినట్లు కనిపిస్తోంది. ఇదే సూత్రం మంత్రులందరికి వర్తించాలన్నా.. ఈ స్థాయిలో పెరుగుదల ఉండే అవకాశం లేదు. యుపిఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలు మరెప్పుడు జరగలేదనేది అక్షర సత్యం. ఒకదాని వెనుక ఒకటి, కోటానుకోట్ల రూపాయల కుంభకోణాలు యుపిఏ హయాంలో వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినవి కాదు. చాలా వరకు దర్యాప్తు సంస్థలు, ఆడిటింగ్‌ సంస్థలు బహిర్గతం చేసినవే. కుంభకోణాలు జరిగినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు బయటపడిన తర్వాత సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసుల దర్యాప్తు కూడా జరుగుతోంది. కొన్నింటిలో నిందితులకు శిక్షలు పడ్డాయి. పదవులు ఊడాయి. అవినీతిపై పోరాటం చేస్తున్నట్లు చెప్పుకునే ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా... ఇలాంటి అవినీతిపరులను ఏం చేయలేకపోయారు. అవినీతిని అంతమొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకోవడం తప్ప... జరుగుతున్నది వేరేగా ఉందనే విషయం ప్రజలకు అర్ధమయింది. అందుకే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రుల ఆస్తులపై.... అవి పెరిగిన తీరుపై అంతగా అనుమానాలు వ్యక్తమవుతునాయి. చాలా మంది మంత్రుల ఆస్తులు రెండు నుంచి మూడు వందల రెట్లు పెరగడం చూస్తుంటే.. ఎంతగా అధికార దుర్వినియోగం జరిగిందో కూడా అర్ధమౌతోంది. గతంలో.. పెరిగిన ఆస్తులు వెల్లడించేందుకు చాలా మంది రాజకీయ నాయకులు ఇబ్బంది పడేవారు. మరి కాలం మారిందో... ప్రజల దృష్టిలో అవినీతిపరులపై అభిప్రాయం మారిందో తెలియదు కానీ.. ఇప్పుడు ఆస్తులను వెల్లడించేందుకు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ అభ్యర్ధులు ఉత్సాహం చూపుతున్నారు. ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత మంచి అభ్యర్ధి అని పార్టీలు కూడా లెక్కిస్తుండటం కూడా ఈ మార్పునకు కారణం కావచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: