రాష్ట్రంలో కమ్మ జనాభా బాగా ఎక్కువ గా ఉన్న జిల్లాలు రెండు. ఒకటి కృష్ణా. రెండు గుంటూరు. ఈ రెండు జిల్లాల్లో జనాభా పరంగా కమ్మవాళ్లు విస్తారంగా ఉన్నారు. రాజకీయంగా కూడా కొంత వరకూ వీళ్లదే ఆధిపత్యం. అందుకే ఈ జిల్లాల్లో అన్ని పార్టీలూ కమ్మ వాళ్లకే ప్రాధాన్యతను ఇస్తాయి. కమ్మ వాళ్ల సొంత పార్టీ తెలుగుదేశం అయినా... ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ అయినా, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయినా ఈ జిల్లాల్లో కమ్మ వాళ్లకు కొంచెం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో కృష్ణా జిల్లా విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్ పోటీ చేశాడు. ఇదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వల్లభనేని వంశీ మోహన్ పోటీ చేశాడు. అతడు కూడా కమ్మవాడే. ఈ సారి ఈ ఇద్దరూ పోటీలో లేరు. లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకోగా... వల్లభనేని గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అయినా ఈ సారి కూడా విజయవాడ ఎంపీ అభ్యర్థులుగా కమ్మవాళ్లే ఉన్నారు. వై.కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కోనేరు రాజేంద్ర ప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కేశినేని నానిలు పోటీలో ఉన్నారు. మరి ఈ నియోజకవర్గంలో ఈ సారైనా తెలుగుదేశం జెండా ఎగురుతుందా? లేక కమ్మవాళ్ల ఆధిపత్యమే ఉన్నా రెడ్డి పార్టీలు జెండా ఎగరేసే అవకాశం ఉందా? అనే అంశం గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేవలం విజయవాడ అని మాత్రమే కాదు.గుంటూరు జిల్లాలోని కమ్మ వాళ్లత ప్రాబల్యంఉన్న నియోజకవర్గాల్లో కూడా అక్కడక్కడ తెలుగుదేశం ఎదురుదెబ్బలు తింటోంది. అలాంటి వాటిలో ఒకటి ప్రత్తిపాడు. గుంటూరు జిల్లాలోని ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ డ్. కమ్మ వాళ్ లజనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. అయినప్పటికీ 2009లో కాంగ్రెస్ గెలిచింది, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచింది. సుచరితకు ఉప ఎన్నికల్లో ముప్పైవేల మెజారిటీ వచ్చింది. మరి కమ్మవాళ్ల ప్రాబల్యం ఉందన్న మాటే ఉంది కానీ ఇలాంటినియోజకవర్గాల్లో వరసగా కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ లే విజయం సాధిస్తూ వస్తున్నాయి. మరి ఈ సారి పరిస్థితి మారుతుందా? లేక అలాగే కొనసాగుతుందా?!

మరింత సమాచారం తెలుసుకోండి: