డబ్బులుంటే చాలు కొందరు పైసాను మిగల్చుకోకుండా ఖర్చు చేస్తారు మరికొందరు కొంత పొదుపుతో ఖర్చు చేస్తారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద కేటాయించిన నిధులున్న వాటిని పూర్తిగా ఖర్చు చేయకపోవటం లేద ఖర్చుచేసిన జాగ్రత్తగా ఖర్చు చేయటం వల్ల ఏటా వందలకోట్లు మురిగిపోతుయ్నాయి. ప్రభుత్వ వైఖరి వల్ల కీలక రంగాలు కూడా నిధులు కొరతతో కొట్టుమిట్టాడిపోతున్నాయి. ఒకసారి పొదుపు, మరోసారి శాఖల కుదింపు పేరుతో కనీసం కేటాయించిన నిధులను కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవటం తో అభివృద్ధిప, సంక్షేమ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తంతు గడిచిన దశాబ్ధకాలంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత పాలకులు కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నరంటే ఆశ్చర్యపోవాల్సింది ఏమి లేదు. అందుకు ఉదాహరణ గత ఆర్ధిక సంవత్సరంలో అంటే 2011-12లో 20 ప్రధానశాఖలకు బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు వాటి ఖర్చును పరిశీలిస్తే ఎంత నిర్లక్ష్యం జరుగుతుందో అర్ధమవుతుంది. గతేడాది నీటిపారుదల శాఖకు రూ.15010.05 కోట్లు కేటాయించగా ఖర్చుచేసినవి రూ.11364.44 కోట్లు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ రూ.3676.51 కోట్లు, ఖర్చు రూ.2719.80 కోట్లు, రవాణా రోడ్లు భవనాలు రూ.2675.82, ఖర్చు రూ.1980.00 కోట్లు, గృహ నిర్మాణం రూ.2300.00కోట్లు, ఖర్చు రూ.1741.47 కోట్లు, పరిశ్రమల శాఖ రూ.775.36, ఖర్చు రూ.372.93, ఇంధనం శాఖ రూ.625.46 కోట్లు, ఖర్చు రూ.23.74 కోట్లు ఇలా కీలకశాఖలు అంటే హోం, ప్రాధమిక, మాధ్యమిక పాఠశాల, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖకు కేటాయించిన నిధులను కూడా మురగపెట్టడం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకత అని, ప్రభుత్వ తీరుకు ఇదో మచ్చుతునక.

మరింత సమాచారం తెలుసుకోండి: