ఈ టైటిల్ చూస్తే.. కాస్త కన్ ఫ్యూజ్ కావడం ఖాయం.. కొంత మంది తప్పేమైనా చదివామా అని మరోసారి చెక్ చేసుకోవచ్చు కూడా.. కానీ మీరు చదివింది రైటే.. మరి ఐశ్వర్యకూ.. మోడీకి కామన్ ఫ్యాక్టర్ ఏంటి.. ఇంతకూ ఐశ్వర్య విడగొట్టింది ఏంటి.. మోడీ కలిపింది ఏంటీ.. ఇదీ మీ ప్రశ్నల పరంపర. ఐశ్వర్య విడగొట్టింది వివేక్ ఒబెరాయ్, సల్మాన్ ఖాన్ లను... మోడీ కలిపింది కూడా వారిద్దరినే.. ఈ స్టోరీ అర్థం కావాలంటే.. కాస్త ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాలి.. పెళ్లికి ముందు ఐశ్వర్య సాగించిన ప్రేమగాథలను ఓసారి తవ్వాలి.. అప్పుడు కానీ సీన్ అర్థం కాదు. టూకీగా మూడు ముక్కల్లో చెప్పాలంటే.. ఐశ్వర్య హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమాలో సల్మాన్ తో నటించిన తర్వాత నుంచి ఆయనతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. ఈ సంగతి బాలీవుడ్ అంతా బహిరంగ రహస్యమే అయ్యింది. పెళ్లి కాని భార్యాభర్తల్లా చాలాకాలం గడిపేశారు. ఆ తర్వాత సల్మాన్ మరీ జులుం చెలాయిస్తుండటంతో ఐశ్వర్య అతడిని భరించలేకపోయింది. క్రమంగా ప్రేమ శిఖరాలు కరిగిపోయాయి. అదే సమయంలో పరిచయమైన వివేక్ ఒబెరాయ్.. క్రమంగా ఐశ్వర్యకు దగ్గరయ్యాడు. సల్మాన్ పాత్రను భర్తీ చేశాడు. ఈ వ్యవహారం వివేక్, సల్మాన్ ఖాన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి తెచ్చింది. ఈ తలనొప్పులన్నీ ఎందుకనుకున్న అమ్మడు.. ఇద్దరినీ కాదని అభిషేక్ బచ్చన్ని కట్టుకుంది. ఐశ్వర్య పెళ్లితో ఈ వ్యవహారం ముగిసిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు మోడీ ప్రమాణ స్వీకారానికి వివేక్ ఒబెరాయ్, సల్మాన్ ఖాన్ , అమితాబ్ బచ్చన్ అంతా హాజరయ్యారు. ఒకే దగ్గరకు వచ్చారు కాబట్టి పలకరించుకోక తప్పలేదు. ఈ అపురూప దృశ్యాలు చూసిన నెటిజన్లు ఊరుకుంటారా.. అలనాటి ఐశ్వర్య ప్రేమగాథను గుర్తు తెచ్చుకుంటూ ట్విట్టర్లో ఫేస్ బుక్కుల్లో ఒకటే పోస్టింగులన్నమాట.. ఐశ్వర్య వివేక్, సల్మాన్ లను విడదీస్తే... మోడీ వారిద్దర్నీ కలిపాడంటూ జోకులేసుకుంటున్నారు నెట్ వర్కింగ్ సైట్లలో.. అదన్నమాట అసలు సంగతి.. ----------- అక్షర

మరింత సమాచారం తెలుసుకోండి: