ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడానికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డి నివాసానికి ఐదు సార్లు ఫోన్ చేసినట్టుగా తెలుగుదేశం అనుకూల మీడియా లో వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు తన సిబ్బంది చేత.. జగన్ నివాసానికి ఫోన్ చేయించాడని అది కూడా ఐదు సార్లు చేయించాడని ఆ మీడియాలో ప్రత్యేక వార్తలు వస్తున్నాయి. అలా ఐదు సార్లు ఫోన్ చేసినా జగన్ అందుబాటులోకి రాలేదని ఆ మీడియా వివరించింది. అయితే రెండు రోజులుగా జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ లో లేడని ఆ మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. జగన్ రెడ్డి పార్టీ సమీక్ష సమావేశాల్లో హాజరు కావడానికి రాజమండ్రికి వెళ్లాడని, అక్కడ తమ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడని అదే మీడియాలో వార్తలు వస్తున్నాయి! మరి ఈ విషయం తెలిసి కూడా జగన్ ఆఫీసుకు ఫోన్ చేస్తే ఆయన ఎలా అందుబాటులోకి వస్తాడు?! ఒక మనిషి ఎక్కడ ఉంటే.. అక్కడికి ఫోన్ చేసి... ఆయనతో మాట్లాడాలి కానీ, రాజమండ్రిలో ఉన్న వ్యక్తితో మాట్లాడటానికి హైదరాబాద్ కు ఫోన్ చేస్తే ఎలా?! అనే సందేహం వస్తుంది. జగన్ ను స్వయంగా ఆహ్వానించడానికి చంద్రబాబు ప్రయత్నించి విఫలం అయ్యాడని.. ఆ మీడియాలో రాశారు! అయితే జగన్ ను నిజంగానే ఆహ్వానించాలని అనుకొంటే... ఫోన్ చేయాల్సింది పార్టీ ఆఫీసుకు కాదు.. ఆయన వ్యక్తిగత ఫోన్ కు లేదా.. సహాయకుడి దగ్గర ఉండే ఫోన్ కు కదా! మనకు ఈ విషయం తెలుసు. కానీ చంద్రబాబుకు ఇలాంటి విషయాలపై పెద్దగా అవగాహన ఉన్నట్టు లేదు పాపం!

మరింత సమాచారం తెలుసుకోండి: