మన ప్రధాని మంచి మనసు ఉన్నవారు. అందరి ఎంపీల మాటలూ పరిగణనలోకి తీ సుకుంటారు. విధాన నిర్ణయాల్లో అందరినీ భాగస్వాములను చేస్తారు'' అని భారతీయ జనతాపార్టీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు విపక్షాలను వదిలేసి కాంగ్రెస్‌ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లు తమ ప్రభుత్వం వ్యవహరించబోదని భరోసా ఇచ్చారు. రాష్ట్రపతిప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మంగళవారం లోక్‌సభలో చర్చను ప్రారంభించారు. ఈ సందర్భగా ఆయన 65 ఏళ్ల కాం గ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. ప్రజాగ్రహంలో ఆపార్టీ కొట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు. ఒక జాతీయపా ర్టీ.. ప్రాంతీయపార్టీ స్థాయికి దిగజారిపోవడాన్ని వూహించలేకపోతున్నామని ఎద్దేవా చేశారు. 65 ఏళ్ల దుష్టపాలనకు ప్రజలు విధించిన శిక్ష ఇది అని విమర్శించారు. రూడీ వ్యాఖ్యలపట్ల ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకునేదని రూడీ ఆరోపించారు. అయితే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అటువంటి వారు కాదని, ఆయనకు చాలా పెద్ద మనసు ఉందని ప్రశంసించారు. "కాంగ్రెస్ 65 ఏళ్లుగా దేశాన్ని నడిపిన విధానాన్ని ప్రతిబింబించే సలహాలను కచ్చితంగా మేం పాటించం'' అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో గందరగోళం నెలకొనగా అందరూ శాంతించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అయితే రూడీ రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలను మాట్లాడకుండా రూడీ చర్చను పక్కదారిపట్టిస్తున్నారని కాంగ్రెస్, తృణమూల్, సీపీఎం సభ్యులు ఆరోపించారు. మళ్లీ రూడీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. పేదలకు ఆహారం, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే మోదీ సర్కారు ప్రధాన లక్ష్యమన్నారు. చేశారు. ధరల పెరుగుదలకు కళ్లెం వేసి మధ్య తరగతి ప్రజలను ఆదుకుంటామని వ్యాపారస్థులకు పన్నుల పేరుతో వే« దింపులు ఉండవని పేర్కొన్నారు. వి ద్యుత్, పర్యాటకం, రైల్వేలు కొత్త ప్రభుత్వ ప్రాధాన్య రంగాలని రూడీ స్పష్టం చేశారు. కాగా రూడీప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానాన్ని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ సమర్థించారు. రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్న అంశాలను ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించలేదని దీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: