సుబ్బరామిరెడ్డి.. పేరులోనే తిక్క ఉన్న రాజకీయనేత ఈయన.. ఒక్క రాజకీయ నేత మాత్రమేనా.. ఆయనో సెలబ్రెటీ.. దేశంలోనే పెద్ద కాంట్రాక్టరు.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్న సినీ నిర్మాత. రాజ్యసభ టిక్కెట్లు సంపాదించుకుని రాజకీయాల్లో కొనసాగడం ఈయనకు తెలిసినంతగా వేరెవరికీ తెలియదేమో.. సినిమా, రాజకీయాలే కాకుండా పేరున్న పారిశ్రామిక వేత్త కూడా. ఇన్ని కోణాలు చాలవన్నట్టు.. ఆయనలో మరో కోణం ఉంది. అదే భక్తి.. మహా శివభక్తుడు.. యజ్ఞాలు, యాగాలు చేయిస్తూ.. అలా కూడా వార్తల్లో నానుతుంటారు. ఇంతటి ఘన నేపథ్యమున్న ఈ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి.. మరో తిక్క పని చేసి వార్తల్లోకి ఎక్కడు. రాజకీయ నేతలు వార్తల్లో వెలగాలంటే.. కాంట్రావర్సీ స్టేట్ మెంట్ చేయడమో.. పేరున్న నేతలు బండబూతులు తిట్టడమో చేస్తుంటారు. అలా చేస్తే.. తిక్కవరపు ప్రత్యేకత ఏముంటుంది.. అందుకే ఈసారి టి. సుబ్బరామిరెడ్డి మరో భిన్నమైన మార్గం ఎన్నుకున్నారు. అదే రాష్ట్రపతి ప్రసంగం.. మోడీ సర్కారు కొలువు దీరిన వేళ.. రాష్ట్రపతి ప్రసంగానికి ఆయన సవరణలు ప్రతిపాదించారు. సవరణ అంటే ఒకటో రెండో కాదండోయ్.. ఏకంగా.. 105 సవరణలు.. అన్ని సవరణలు ప్రతిపాదించాలంటే.. ముందు ఆ ప్రసంగంపై పట్టుసాధించాలి. మరి ప్రసంగం ఆసాంతం చదివారో.. ఎవరికైనా పని పురమాయించారో గానీ.. సవరణలు మాత్రం ప్రతిపాదించారు. సరే అంతవరకూ బాగానే ఉంది. అక్కడితో ఆగితే.. ఆయన తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ఎందుకవుతాడు.. అందుకే సవరణలపై ఓటింగ్ సమయం వచ్చేసరికి వాటిని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారట. సో.. సవరణలు ప్రతిపాదించినట్టూ అయ్యింది.. రావలసిన పాపులారిటీ వచ్చింది. మళ్లీ ఉపసంహరణ జరిగింది. కాకపోతే.. తిక్కవరపుకు తెలియని విషయం ఒకటుంది. అదేంటంటే.. ఇలాంటి పనులతో వచ్చే పాపులారిటీ.. అంతకు ముందు ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా తగ్గించివేస్తుందన్నది. కాదంటారా..

మరింత సమాచారం తెలుసుకోండి: