ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పై గానీ తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టంచేశారు. సూర్యాస్తమయం తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తే అరిష్టమని మాత్రమే తాను చెప్పినట్లు ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. పీఠాధిపతులను సంప్రదించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సి ఉందని స్వామి స్వరూపానందేంద్ర అన్నారు. చంద్రబాబు వల్లనే వర్షాలు పడడం లేదని స్వరూపానందేంద్ర చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం గతంలో కూడా బాబు హయాంలో పరిస్థితి ఇలాగే ఉన్నదని ఆయన అన్నారు. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి తెలుగుదేశం పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో డిమాండ్ చేసింది. పీఠాధిపతులు స్వామీజీలను కించపరచడం టీడీపీకి తగదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం వర్షాభావ పరిస్థితుల స్వామీజీలను కించపరిస్తే చట్టపరమైన చర్యలకు సిద్దమన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: